పేదల సంక్షేమమే సర్కారు లక్ష్యం

Sun,June 16, 2019 01:37 AM

* ప్రతి ఒక్కరి సంతోషమే సీఎం కేసీఆర్‌ అభిమతం
* ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదనే ‘కల్యాణలక్ష్మి’
* మహిళల దీవెనలతోనే రెండోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
* ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, సుంకె రవిశంకర్‌
* కరీంనగర్‌లో 66మందికి 10.98 కోట్లు..
-గంగాధరలో 32మందికి 35.81 లక్షల చెక్కుల పంపిణీ
కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలోని పేదల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. పేదలకు ఆడ పిల్లల పెళ్లిళ్ల భారాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో ఈ పథకం తీసుకువచ్చారన్నారు. కరీంనగర్‌ నియోజకవర్గ పరిధిలోని నగరంలోని లబ్ధిదారులకు శనివారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలో 66 మంది లబ్ధిదారులకు చెక్కులు అందిస్తున్నామన్నారు. గత నాలుగేళ్లలో నగరంలో 1114 మందికి 10.98 కోట్ల చెక్కులు అందించామన్నారు. నియోజకవర్గ పరిధిలో సుమారుగా 20 కోట్లు అందించామన్నారు. ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మితోపాటు ప్రసావానికి కేసీఆర్‌ కిట్‌ను కూడా అందిస్తున్నామని తెలిపారు. మహిళల దీవెనల వల్లే రాష్ట్రంలో మరోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలన్న ఆలోచనతోనే సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పెళ్లి రోజే ఈ కళ్యాణలక్ష్మి చెక్కు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ ప్రజలందరి దీవెనలతో నూరెళ్లు ఆయుఆరోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరు సద్వినియోగం చేసుకొవాలని కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు వై.సునీల్‌రావు, తాటి ప్రభావతి, పెంట సత్యం, గందె మాధవి, ఎవీ రమణ, బోనాల శ్రీకాంత్‌, లింగయ్య, నాయకులు సతీష్‌, కలర్‌ సత్తన్న, కర్రె రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎంతో ఉపయోగపడుతుంది
- శోభరాణి, సంతోష్‌నగర్‌
పేదల కోసం అందిస్తున్న ఈ పథకం ఆడపిల్ల ఉన్న ఇంట్లో వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పెళ్లి ఖర్చుల నుంచి ఈ లక్ష రూపాయాలు ఎంతగానో వినియోగపడుతున్నారు. ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌కు ఎప్పటికి రుణపడి ఉంటాం.
ఇంత మంచి పథకానికి అండగా ఉంటాం
- సత్యదేవి, విద్యానగర్‌
తమకు కోసం ఇంత మంచి పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌కు ఎప్పటికి అండగానే ఉంటాం. ఆడపిల్ల పెళ్లి చేసిన తమకు ఈ డబ్బులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఇలాంటి పథకాలను ఏ ప్రభుత్వాలు కూడ ఆలోచన చేయలేదు. దీనిని అందరు ఉపయోగించుకొవాలి
మాలాంటి వాళ్లకు ఆసరాగా నిలుస్తుంది
- నాగమణి, పాతబజార్‌
ఆడపిల్ల పెళ్లి చేసిన మాలాంటి వారికి ఈ పథకం ఎంతగానో ఆసరగా మారుతుంది. పెళ్లి ఖర్చులకు ఈ లక్ష రూపాయాలు ప్రభుత్వమే ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉంది. పేదల కోసం ఆలోచించే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్లకాలం ఉండాలి.

104
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles