అసత్య ఆరోపణలు మానుకోవాలి

Sun,June 16, 2019 01:36 AM

-ట్రస్మా రాష్ట్ర ప్రధానకార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు
తెలంగాణచౌక్‌: ప్రైవేట్‌ పాఠశాలలపై విద్యార్థి, కుల సంఘాలు అసత్య ఆరోపణలు మానుకోవాలని తెలంగాణ రికగ్నైజ్డ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు అన్నారు. ప్రైవేట్‌ పాఠశాలలు విద్యను వ్యాపారం చేయడం లేదని స్పష్టంచేశారు. శనివారం స్థానిక ప్రెస్‌భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పెట్టుబడులు పెట్టి నాణ్యమైన విద్యను బోధించడం వల్లే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలకు పంపుతున్నారన్నారు. అలాగే తల్లిదండ్రుల కోరిక మేరకే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కుల విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. మార్కెట్‌ ధర కన్నా 5 శాతం తక్కువకే ఇస్తున్నామన్నారు. వీడీసీల పేరుతో కొందరు గ్రామాల నుంచి ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులకు జరిమానా విధించడం, వ్యాన్లను అడ్డుకోవడం తగదన్నారు. జిల్లా విద్యాధికారి ప్రైవేట్‌ పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరైతే విమర్శించడం సమంజసం కాదన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల పర్యవేక్షణకు ప్రత్యేక విద్యాధికారిని నియమించాలన్నారు. స్కూల్‌ బస్సులకు స్పీడ్‌ గవర్నెన్స్‌ పెట్టే విధానాన్ని తొలగించాలన్నారు. కుల, విద్యార్థి సంఘాలు అసత్య ఆరోపణలు, అడ్డుకోవడాలు లాంటి ఘటనలకు దిగితే, తమకున్న హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం ఆనందరెడ్డి, నగర కోశాధికారి పచ్చునూరి సురేందర్‌లు పాల్గొన్నారు.

90
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles