ఆడపిల్ల పెళ్లికి భరోసా

Sun,June 16, 2019 01:35 AM

* గంగాధరలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
* 32 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
గంగాధర : ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం పేద, మధ్యతరగతి ఆడపిల్లల పెళ్లికి భరోసానిస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. మండలంలోని బూరుగుపల్లిలో శనివారం వివిధ గ్రామాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు 35 లక్షల 81 వేల 176రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఇందులో ఆచంపల్లి గ్రామానికి చెందిన రేకుల పవిత్ర, రేకుల ప్రవళిక, బూరుగుపల్లి చెందిన కడారి అనిత, గంగాధరకు చెందిన తూం హిందూజ, నల్ల పద్మ, దూడం గౌతమి, బాసవేణి కవిత, మేడి మౌనిక, వొడ్నాల స్రవంతి, గర్శకుర్తికి చెందిన కోరుకంటి గౌతమి, గట్టుభూత్కూర్‌కు చెందిన సర్వు మాధవి, మల్కాపురం కళ్యాణి, బొల్లబత్తిని మౌనిక, కొండాయపల్లి బండారి శిరీష, కురిక్యాల గ్రామానిఇ చెందిన ఒగ్గరి మౌనిక, కడారి రేణుక, మల్లాపూర్‌కు చెందిన ఆదిపెల్లి ప్రీతి, నునుగొండ రమ్య, కోల సమత, నాగిరెడ్డిపూర్‌కు చెందిన మోడి అర్చన, నర్సింహులపల్లికి చెందిన గుంట స్వప్న, నారాయణపూర్‌కు చెందిన ఎడవెల్లి గీతాంజలి, న్యాలకొండపల్లికి చెందిన ఆవ సమత, ఒదార్యంకు చెందిన సామల ఆరుణజ్యోతి, నర్సింగోజు సౌందర్య, ర్యాలపల్లికి చెందిన తూడి శృతి, ఎర్రోజు మాధవి, బల్ల జమున, ఉప్పరమల్యాలకు చెందిన ఆకుల ప్రగతి, బండ లత, వెంకటాయపల్లికి చెందిన నరుకుల్ల గౌతమికి 100116 రూపాయల చొప్పున చెక్కులు అందజేసారు. ఆచంపల్లికి చెందిన అమ్ముల పద్మ, బూరుగుపల్లికి చెందిన మాలెపు రజిత, కాచిరెడ్డిపల్లికి చెందిన సల్ల సమత, సర్వారెడ్డిపల్లికి చెందిన ముప్పిడి ప్రత్యూష,ఉప్పరమల్యాలకు చెందిన కుంబోజు రజిత 75116 చొప్పున , సర్వారెడ్డిపల్లికి చెందిన సుంకరి శ్రీలత, ఉప్పరమల్యాలకు చెందిన సందవేణి వకులకు 51000 వేల చొప్పున మంజూరైన చెక్కులను అందజేసారు.కార్యక్రమంలో ఎంపీపీలు దూలం బాలగౌడ్‌, శ్రీనాం మధూకర్‌, జడ్పీటీసీ పుల్కం అనురాధ నర్సయ్య, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్‌, మేచినేని నవీన్‌రావు, రాసూరి మల్లేశం, ఆకుల శంకరయ్య, కంకణాల విజేందర్‌రెడ్డి, రేండ్ల జమున, దోర్నాల హన్మంతరెడ్డి,ములకుంట్ల సంపత్‌, కొంకటి శంకర్‌, పొట్టల కనుకయ్య, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్‌రెడ్డి, అట్ల రాజిరెడ్డి, బాబు మల్లేశం, నాయకులు ఆకుల మధుసూధన్‌, అట్ల శేఖర్‌రెడ్డి, రేండ్ల రాజిరెడ్డి, రేండ్ల శ్రీనివాస్‌, బొల్లాడి శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

94
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles