చెర్లభూత్కూర్‌లో ఉపాధికూలీ..

Sat,June 15, 2019 02:37 AM

కరీంనగర్‌ రూరల్‌: కరీంనగర్‌ మండలంలోని చెర్లభూత్కూర్‌ గ్రామంలో ఉపాధిహామి కార్మికుడు నరహరి రాజిరెడ్డి (35) గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. చెర్లభూత్కూర్‌ గ్రామానికి చెందిన నరహరి రాజిరెడ్డి ఉదయం 6.30 గంటలకు గ్రామంలోని ఊర చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. ఉదయం 9.45 గంటలకు ఉపాధిహామీ పనుల్లో ఉండగానే, నొప్పిగా ఉందని అక్కడే కుప్పకూలడంతో తోటి కార్మికులు వెంటనే వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. కాగా, గ్రామస్తులు వడదెబ్బతో మృతి చెందాడని మండల అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. ఎంపీడీవో పవన్‌కుమార్‌, తాసిల్దార్‌ కుమారస్వామి, ఎస్‌ఐ, ఏపీవో, కొత్తపల్లి పీహెచ్‌సీ వైద్యులు వచ్చి పరీక్షలు చేసి, గుండె పోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య రజితతోపాటు వరుణ్‌తేజ్‌ (6), తేజస్వి(4) ఉన్నారు. సర్పంచ్‌ దబ్బెట రమణారెడ్డి, ఎంపీటీసీ బుర్ర తిరుపతిగౌడ్‌, మాజీ ఉపసర్పంచ్‌ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, గ్రామ నాయకులు రాజిరెడ్డి , తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఆదుకోవాలని అధికారులను కోరారు.

80
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles