రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు

Sat,June 15, 2019 02:37 AM

జమ్మికుంట: మున్సిపల్‌ పరిధిలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్లపై శుక్రవారం రాత్రి పురపాలక కమిషనర్‌ అనిసూర్‌ రశీద్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ.25వేల విలువజేసే నాసిరకం ఆహార పదార్థాలను సీజ్‌ చేశారు. పట్టణంలో మూడు బార్‌ అండ్‌ రెస్టారెంట్లున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా, నాసిరకం ఆహారాన్ని వినియోగదారులకు అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో గొడవలు జరిగాయి. అధికారులకు ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కమిషనర్‌ అనిసూర్‌ రశీద్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్లపై దాడులు చేశారు. కొద్ది రోజుల క్రితం తయారైన ఆహార పదార్థాలు, వండేందుకు సిద్ధంగా ఉన్న నాసిరకం సరుకులు, అపరిశుభ్రంగా ఉన్న వంట గదులు, చెత్తా, చెదారంతో నిండిన పరిసర ప్రాంతాలు చూసి అధికారులు, సిబ్బంది విస్మయం చెందారు. నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరుకులు, పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సీజ్‌ చేశారు. తర్వాత కమిషనర్‌ మాట్లాడుతూ.. మున్సిపల్‌ పరిధిలోని మూడు బార్‌ అండ్‌ రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు చేశామని చెప్పారు. రూ.25వేల విలువజేసే ఆహార పదార్థాలు సీజ్‌ చేశామని తెలిపారు. దాడులు కొనసాగుతున్నాయనీ, అవసరమైతే పోలీసులు, ఆబ్కారీ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని కమిషనర్‌ తెలిపారు. ఆ మూడు బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేస్తామనీ, తర్వాత చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆయన వెంట అధికారులు, సిబ్బంది ఉన్నారు.

82
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles