రేకుర్తి ఇందిరమ్మ కాలనీలో కార్డన్‌ సెర్చ్‌

Sat,June 15, 2019 02:36 AM

కరీంనగర్‌ క్రైం: కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం శుక్రవారం ఉదయం రూరల్‌ ఏసీపీ ఉషారాణి ఆధ్వర్యంలో రేకుర్తి ఇందిరమ్మ కాలనీలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటినీ క్షుణ్నంగా తనిఖీ చేసి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో భాగంగా 8 ఆటోలు, ద్విచక్ర వాహనాలు, అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లను సీజ్‌ చేసి, మైనింగ్‌కు అప్పగించారు. అనంతరం కాలనీవాసులతో ఏసీపీ మాట్లాడుతూ, కమిషనరేట్‌ పరిధిలో నేర నియంత్రణ కోసం పోలీసులు చేస్తున్న కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తున్నదన్నారు. కమ్యూనిటీ సీసీ టీవీ ప్రాజెక్టులో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ రాధాకృష్ణమూర్తి నాలుగు కెమెరాలు, అంజి, కల్యాణ్‌ మరో మూడు కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ముగ్గురిని ఏసీపీ అభినందించారు. ఏసీపీ వెంట కరీంనగర్‌ రూరల్‌ సబ్‌ డివిజన్‌ పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles