రక్తదానం.. ప్రాణదానం..

Fri,June 14, 2019 02:22 AM

జగిత్యాల,నమస్తే తెలంగాణ : దేశంలో ప్రతి రెండున్నర సెకన్లకు ఒకరికి రక్తం అవసరం అవుతుంది. కానీ, ప్రతి వెయ్యి మందికి నలుగురే రక్తదానం చేస్తున్నారు. దేశంలో ఏడాదికి 4 కోట్ల యూనిట్ల రక్తం అవసరం అవుతుండగా, అయితే కేవలం 40లక్షల యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటోంది. దీంతో సకాలంలో రక్తం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాల్సిన అవసరం ఎం తైనా ఉంది. రక్తంలోని గ్రూప్‌లపై 1900 సంవత్సరం లో పరిశోధనలు ప్రారంభించిన డాక్టర్ కార్ల్‌లాండ్ స్టె యినర్ పుట్టిన రోజును పురస్కరించుకుని జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటారు.

మనిషికి రక్తమే ప్రాణాధారం. చిన్నపాటి గాయమైన సమయంలో శరీరంలోంచి బయటకు వచ్చే రక్తం విలువ వెలకట్టలేం. మానవుని శరీరంలో రక్తం అసవరమైనంత మేరకు ఉండాల్సిందే. లేకపోతే రక్తహీనతతో బాధపడుతారు. రక్తంలోని గ్రూప్‌లను నాలుగు బాగాలుగా విభజించారు. వాటిలో ఏ, బీబ, ఏబీ, గ్రూపులు గా విభజించారు. ఓను విశ్వదాత అని, ఏబీని విశ్వగ్రహీత అని అంటారు.

రక్తదానం ఎవరు చేయవచ్చు..
418 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న స్త్రీ, పురుషులందరూ రక్తదానం చేయవచ్చు.
4శరీరం బరువు కనీసం 45 కిలోలు తగ్గకుండా ఉండాలి. హిమోగ్లోబిన్ 12.5 గ్రాములుగా ఉండాలి.
4రక్తపోటు(బీపీ) సాధారణ స్థితిలో ఉండాలి. (120/80.)
4గుండె నిమిషానికి 60 నుంచి 100 మధ్యలో కొట్టుకోవాలి.

ఎవరు చేయకూడదు...
హెచ్‌ఐవీ, మలేరియా, క్యాన్సర్, హైబీపీ, హైపటైటీస్-సీ, వంటి వ్యాధులు ఉన్నవారు రక్తదానం చేయడానికి ఆనర్హులు. మూర్చవ్యాధి ఉన్నవారు, మూత్రపిండ వ్యాధులు ఉన్నవారు, గుండెకు సంబంధించిన వ్యాధులున్న వారు రక్తదానానికి ఆనర్హులు.

రక్తదాన ప్రక్రియ...
రక్తదానం చేసేటందుకు 5 నుంచి 7 నిమిషాల సమయం పడుతుంది. రక్తదానం చేస్తే ఎలాంటి ఆలసట, నీరసం ఉండదు. రక్తదానం చేయడానికి ముందు కొద్దిగా ఆల్పాహారం తీసుకుంటే బాగుంటుంది. రక్తదానం చేసిన తర్వాత 10 నుంచి15 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుని మన సాధారణ పనులు యధావిధిగా చేసుకోవచ్చు. ప్రతి మానవుడి శరీరంలో కనీసం 6 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తదానం చేసినప్పుడు అందులో కేవలం 300 నుండి 350 మిల్లిలీటర్ల రక్తం మాత్రమే తీసుకుంటారు. రక్తదానం చేసిన తర్వాత 24 గంటల నుంచి 76 గంటల్లోపు రక్త ప్రసరణ పూర్తి స్థా యికి చేరుకుంటుంది. ప్రతి ఒక్కరూ తమ జీవిత కా లంలో 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల మధ్య ప్రతి 3నెలలకోసారి రక్తదానం చేస్తే 168 సార్లు రక్తాన్ని దానం చేయవచ్చు.

ఒకరి రక్తంతో నలుగురికి ప్రాణదానం
ఒకరి రక్తాన్ని కాంపోనెంట్స్‌గా అంటే తెల్లరక్తకణా లు, ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లేట్స్, ప్లాస్మాగా వేరు చేసి న లుగురి ప్రాణాలు కాపాడవచ్చు. తెల్ల రక్తకణాలను హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారికి డెంగీ జ్వరం ఉన్నవారికి ఎక్కిస్తారు. కాలిన గాయాలైన వారికి ప్లాస్మాను ఎక్కిస్తారు. రక్తస్రావం తీవ్రంగా అవుతున్నవారికి (క్రయో) ఎక్కించి రక్తస్రావాన్ని ఆదుపుచేస్తారు.

ప్రతి రోజూ నలుగురికి రక్తం అందిస్తాం...
రక్తదానం పట్ల యువకుల్లో చైతన్యం కల్పిస్తూ, ప్రమాదాల్లో తీవ్రంగా గా యపడి, అత్యవసర శస్త్రచికిత్సలు చేయించుకునే వారికి రక్తదానం అందిస్తున్నాం. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థను 2014లో స్థా పించడంతో పాటు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి అత్యవసర సమయాల్లో రక్తదానం చేసి వారి ప్రాణాలు కాపాడుతున్నాం. అంతేకాకుండా గత రెండేళ్లలో 3 సార్లు తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశా. ఇటీవల కోరుట్ల, కథలాపూర్ మండల కేంద్రాల్లో ఏర్పా టు చేసిన రక్తదాన శిబిరాల్లో ఉత్తమ రక్తదాత అవార్డును అందజేశారు.

73
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles