ప్రమాదాల నివారణ అందరి బాధ్యత

Thu,June 13, 2019 01:31 AM

-యువకుల మరణం దేశానికి తీరనిలోటు
-ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడుడాక్టర్ బీఎన్‌రావు
కరీంనగర్ హెల్త్ : జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ఎందరో మృత్యువాత పడుతున్నారనీ, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బీఎన్‌రావు ఉద్ఘాటించారు. బుధవారం కరీంనగర్ ఐఎంఏ హాల్ లో ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశంలో ప్రతిరోజు వెయ్యికి పైగా ప్రమాదాలు జరుగగా ఇందులో 400 మందికి పైగా మృత్యువాత పడుతున్నారనీ, వీటితో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయ న్నారు. ప్రమాదాల్లో 30 శాతం మంది విద్యార్థులు, 50 శాతం మంది యువత మృత్యువాత పడుతున్నదని అన్నారు. వారి మరణం దేశానికి తీరని లోటన్నా రు. జిల్లాలో కూడా ఐఎంఎ పక్షాన రోడ్డు ప్రమాదాల నివారణకు తమవంతుగా కృషి చేస్తామన్నారు. బాధ్యతరహిత డ్రైవింగ్ , అతి వేగం, వాహనాలను నడుపుతూ ఫోన్లు మాట్లాడడం, మద్యం తాగి డ్రైవింగ్ చే యడం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. కారులో ప్రయాణించినప్పు డు ఒక డ్రైవర్ మాత్రమే సీటు బెల్టు పెట్టుకుంటున్నారనీ, ప్రమాదం జరిగినప్పుడే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అ యితే ఒక డ్రైవర్ మాత్రమే బతుకుతున్నాడని, కార్లలో ఉన్న ప్రతి ఒక్కరు సీటు బెల్టును ధరిస్తే ప్రమాదం జరిగినప్పుడు అన్ని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయన్నారు. వీటిపై ఎక్కువ మంది అవగాహన లేదన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కలెక్టర్, సీపీలతో మాట్లాడామని త్వరలోనే ట్రాఫిక్ ఏసీపీతో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కార్యక్రమాలను కల్పిస్తామన్నారు. ఎక్కడ ప్రమాదాలు జరిగినా వైద్య సేవలు ఎమర్జీన్సీగా అందిస్తామన్నారు. కార్యక్రమంలో తానా రాష్ట్ర అధ్యక్షుడు సాగర్‌రావు, ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు పొలాడి శ్రీనివాస్‌రావు, జీవీఎస్ తిరుపతిరెడ్డి, చిట్టుమల్ల ప్రదీప్, సురేశ్, ఝాన్సీ, గీతారెడ్డి, మేఘన, తదితరులు పాల్గొన్నారు.

90
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles