అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలి

Thu,June 13, 2019 01:30 AM

ముకరంపుర: కేంద్రం అగ్రవర్ణ పేదలకు అమలు చేస్తున 10 శాతం రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేయాలని ఓసీ సంఘాల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడు, తెలంగా ణ రాష్ట్ర కన్వీనర్ పోలాడి రామారావు కోరారు. బుధవారం ఉమ్మడి జిల్లా ఓసీ సం ఘాల జేఏసీ నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాజస్థాన్‌లో అమలవు తున్న విధంగా రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. అంతకుముం దు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రా వును ఓసీ సంఘాల నేతలతో కలసి శాలువతో సన్మానించారు. తమ డిమాండ్లపై వినతి పత్రాన్ని సమర్పించి సీఎం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. స్థానిక సం స్థల ఎన్నికల్లో గెలుపొందిన ఓసీ సామాజికవర్గ ప్రజాప్రతినిధులను జిల్లా కేంద్రంలో సన్మానించనున్నట్లు లిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వూట్కూరి రాధాక్రిష్ణారెడ్డి, రాష్ట్ర సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి, ఉత్తర తెలంగాణ జిల్లాల కన్వీనర్ చెన్నమనేని పురుషోత్తమరావు, రాష్ట్ర బ్రాహ్మణ సంఘం జేఏసీ అధ్యక్షుడు శ్రీరాంభట్ల దీపక్‌బాబు, నాయకులు వేముల సుదర్శన్‌రెడ్డి, అండెం రమణారెడ్డి, గర్రెపెల్లి శంకరలిం గం, కనపర్తి లింగారావు తదితరులు పాల్గొన్నారు.

84
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles