15న క్రీడా కథ సంకలనం ఆవిష్కరణ సభ

Thu,June 13, 2019 01:30 AM

కరీంనగర్ కల్చరల్: స్థానిక వాగీశ్వరీ డిగ్రీ కళాశాలలో కస్తూరి మురళీకృష్ణ సంపాద కత్వంలో వెలువడిన క్రీడా కథ సంకలనం ఆవిష్కరణ సభ ఈ నెల 15న సాయంత్రం 5 గంటలకు ఉంటుందని సమైక్య సాహితీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాడిశెట్టి గోపాల్, కేఎస్ అనంతాచార్య ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ సా హిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహరెడ్డి, విశిష్ట అతిథులుగా ప్రముఖ రచయిత కేపీ అశోక్ కుమార్, కవి, రచయిత వారాల ఆనంద్, ఆత్మీ య అతిథులుగా సాహితీ గౌతమి ప్రధాన కార్యదర్శి గాజుల రవీందర్, తెలంగాణ రచయితల సం ఘం కరీంనగర్ అధ్యక్షుడు డాక్టర్ కలువకుంట రామకృష్ణ, తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ అధ్యక్షుడు కందుకూరి అంజయ్య హాజరవుతారని తెలిపారు. కథారచయిత డాక్టర్ బీవీఎన్ స్వామి పుస్తక పరిచయం చేస్తారని పేర్కొన్నారు. కవులు, రచయితలు హాజరుకావాలని కోరారు.

86
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles