నేడు జీఎస్టీ ఆడిట్‌పై సెమినార్

Thu,June 13, 2019 01:30 AM

సుభాష్‌నగర్: కరీంనగర్ చార్టర్డ్ అకౌంటెట్ల విభాగం ఆధ్వర్యంలో గురువారం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు స్థానిక శ్వేత హోటల్‌లో జీఎస్టీ ఆడిట్, విదేశీ పెట్టుబడులు, విదేశీ మారక ద్రవ్య చ ట్టాలపై ఒక రోజు సెమినార్ ఏర్పాటు చేసినట్లు కరీంనగర్ సీఏల శాఖ చైర్మన్ ఎం సంతోష్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి జీఎస్టీ సెంట్రల్ టాక్స్ కరీంనగర్ డివిజన్ అసిస్టెంట్ కమీషనర్ జే విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జీఎస్టీ డీలర్లు పాటించాల్సిన ని యమ నిబంధనలు, వివరిస్తారని చెప్పారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన నిపుణులు, సీఏ మునీందర్, విదేశీ మారక ద్రవ్యాల చట్టాల నిపుణులు సీఏ మురళీకృష్ణ పాల్గొని, సీఏలు తమ ఆడిట్ రిపోర్ట్‌లు సమర్పించేటపుడూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తప్పిదాలకు సీఏలు వివిధ చట్టాల కింద ఎదుర్కొనున్న శిక్షల గురించి చర్చించను న్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని సీఏలు, సీఏ విద్యార్థులు, ఇతర వృత్తి నిపుణులు సెమినార్‌లో పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకోవాలని కరీంనగర్ చార్టర్డ్ అకౌంటెంట్ల శాఖ కార్యదర్శి ఎం ఆదిత్య కోరారు.

86
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles