గ్రామాల సమగ్రాభివృద్ధికి పాటుపడాలి

Wed,June 12, 2019 01:31 AM

-హరితహారం విజయవంతం చేయాలి
-నిధుల వినియోగంలో నిబంధనలు పాటించాలి
- నూతన పంచాయతీరాజ్ చట్టంపై సర్పంచులకు అధికారుల అవగాహన
హుజూరాబాద్ టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు భారీగా నిధులు కేటాయిస్తున్నదని, నూతన సర్పంచ్‌లు గ్రామాల సమగ్రాభివృద్ధికి పాటుపడాలని అధికారులు సూచించారు. నూతన పంచాయతీరాజ్ చట్టంపై మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లకు మంగళవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో అవగాహన కల్పించారు. దీనికి జిల్లా రిసోర్స్ పర్సన్స్ రమేశ్, వేణులు హాజరై 14వ ఫైనాన్స్ నిధులు, డిజిటల్ కీ, ఐఎస్‌ఎల్ నిర్మాణం, దరఖాస్తు చేసుకునే విధానం, హరితహారంపై సమగ్రంగా వివరించారు. అలాగే ఈవోపీఆర్‌డీ జే రేవంత్‌రెడ్డి గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ విధులు, నిధుల గురించి, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ తదితర అంశాలపై సర్పంచ్‌లకు కూలంకషంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నాటిన మొక్కల్లో 85శాతం సంరక్షించకపోతే గ్రామ సర్పంచ్, కార్యదర్శులను విధుల్లోంచి తొలగిస్తారని చెప్పారు. నాటిన ప్రతి మొక్కను నీరు పోసి, కంచె నాటి బతికించే ప్రయత్నం చేయాలన్నారు. అలాగే ఇచ్చిన లక్ష్యం ప్రకారం మొక్కలు గ్రామ గ్రామాన నాటించాలన్నారు. పన్నుల వసూలు, నిధుల వినియోగంలో నిబంధనలు పాటించాలనీ, అవకతవకలు జరిగితే క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సూపరింటెండెంట్ జీవన్‌రెడ్డి, స్వచ్ఛ భారత్ డీఆర్‌పీలు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles