పారమితలో నూతన విద్యా విధానంపై చర్చ

Wed,June 12, 2019 01:30 AM

సుభాష్‌నగర్: నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో స్థానిక పారమిత ఐరిస్, ఎక్స్‌ప్లోరికా పాఠశాలల టీచర్లతో కేంద్రం ప్రవేశ పెట్టనున్న నూతన విద్యావిధానానికి పునాదులు వేసే ప్రణాళికలపై మంగళవారం చర్చ కార్యక్రమం నిర్వహించారు. రేకుర్తిలోని ఓ కల్యాణ మండపంలో పారమిత పాఠశాలల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాద్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నిర్మాణాత్మక ప్రణాళిక కింద 2019-2020కి అనుసంధానంగా ఉపాధ్యాయ శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, వైజ్ఞానిక దృక్ఫథానికి పునాదులు వేయటం, కృత్యాధార బోధన, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడం తదితర విద్యా విషయక విషయాలపై ఈ సందర్భంగా కూలంకషంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు ప్రసూనతో పాటు ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్స్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

88
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles