దాతృత్వంలోనే మనిషి గొప్పదనం

Wed,June 12, 2019 01:29 AM

కరీంనగర్ కల్చరల్ : తను సంపాదించిన దానిలో కొంత దానం చేయడంలోనే మనిషి గొప్పదనం తెలుస్తుందని త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్‌స్వామి అన్నారు. మంగళవారం రాత్రి నగరంలోని సప్తగిరికాలనీలోని శ్రీ కోదండ రామాలయంలో దాతల సహకారంతో నిర్మించిన వంటశాల, భోజనశాలను స్వామీజీ ప్రారంభించారు. ముందుగా ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు స్వామీజీకి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కోదండ రామున్ని దర్శించుకుని అనుగ్రహ భాషణం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కే గౌతంరావు, ఆయన బృందం ఆలయ అభివృద్ధి పనులు ప్రణాళిక బద్ధంగా చేపడుతున్నారని అభినందించారు. దాతలతో పాటు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌కు స్వామీజీ మంగళ శాసనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గౌతంరావు, శ్రీహరిరెడ్డి, రాజిరెడ్డి, రామయ్య, పాపిరెడ్డి, డాక్టర్ రాజభాస్కర్‌రెడ్డి దంపతులు, అశోక్‌రావు, గోపాల్‌రావు, జువ్వాడి రాజేశ్వర్‌రావు, నమిలికొండ రమణాచార్యులు, ప్రధానార్చకులు కలకుంట్ల రామాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles