బోనమెత్తిన బొమ్మకల్

Mon,May 27, 2019 02:09 AM

కరీంనగర్ రూరల్: బొమ్మకల్ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో పోశమ్మకు వైభవంగా బోనాలు తీశారు. గ్రామంలోని కొచ్చగుట్ట మలికార్జునస్వామి పట్నాల సందర్భంగా పోచమ్మతల్లికి బోనాలు సమర్పించారు. బైండ్ల పూజారుల ఆట పాట, శివసత్తుల పూనకాలతో ప్రతి ఇంటి నుంచి బోనంతో బయలుదేరగా గ్రామ వీధుల్లో సందడి నెలకొంది. పోచమ్మ గుడి వరకు ఊరేగింపుగా వెళ్లి, నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, జడ్పీటీసీ అభ్యర్థి పీ లలిత, డీ సుధాకర్, వీ శ్రీనివాస్, జీ తిరుపతిరెడ్డి, టీ కిరణ్, లక్ష్మీనారాయణ, యాదవ సంఘం అధ్యక్షుడు కాల్వ నర్సయ్యయాదవ్, కాల్వ మల్లేశంయాదవ్, కాల్వ అశోక్‌యాదవ్, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

89
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles