నిత్యసాధనతో సత్ఫలితాలు

Mon,May 27, 2019 02:08 AM

ముకరంపుర: క్రీడల్లో నిత్య సాధన చేసి పోటీల్లో పాల్గొంటేనే సత్ఫలితాలు సాధ్యమని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా బాక్సింగ్ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలనీ, భవిష్యత్‌లో ఉన్నతంగా రాణించి పతకాలు సాధించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు జాతీయస్థాయి పోటీల్లో అద్వితీయ ప్రతిభతో పతకాల పంట పండించి, దేశవ్యాప్తంగా తెలంగాణ కీర్తిని చాటాలన్నారు. రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలను కరీంనగర్‌లో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇన్‌ఛార్జ్ డీవైఎస్‌వో సిద్ధారెడ్డి, టీఎన్జీవోస్ సంఘం జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వ,ర్ జిల్లా చదరంగం సమాఖ్య అధ్యక్షుడు ఎం. అంజయ్య, బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు అనిల్ , కార్యదర్శి దిగ్విజయ్, జిల్లా బాక్సింగ్ సంఘం కార్యదర్శి వీరస్వామితోపాటు రామకృష్ణ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్ష, కార్యదర్శులు కోచ్‌లు, మేనేజర్‌లు, రెఫరీలు, తదితరులు పాల్గొన్నారు.

88
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles