ముగిసిన ఎయిమ్స్ ప్రవేశ పరీక్ష

Mon,May 27, 2019 02:08 AM

తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ : ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ ఎంబీబీఎస్) న్యూఢిల్లీలో ప్రవేశాల కోసం రెండు రోజులుగా నిర్వహించిన ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాల ఆయాన్ డిజిటల్ కేంద్రంలో పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిర్వహించారు. మొత్తం 681 మందికి ఏర్పాట్లు చేయగా 594 మంది హాజరు కాగా, 87 మంది గైర్హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 7.30గంటల నుంచి, మధ్యాహ్నం 1.30గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించారు. పరీక్ష రాసే విద్యార్థులను క్షుణ్నంగా తనిఖీ చేసి లోనికి పంపించారు. బంగారు అభరణాలు, వాచ్‌లు, సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను లోనికి అనుమతించలేదు. పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు నిర్వాహకులు ప్రకటించారు.

78
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles