ముగిసిన ఐసెట్

Sat,May 25, 2019 01:49 AM

-రెండో రోజు 1672 మంది హాజరు
-145 మంది గైర్హాజరు
తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ : రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి రెండు రోజులుగా ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్న ఐసెట్-2019 శుక్రవారంతో ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని వాగీశ్వరిలో రెండు, శ్రీచైతన్యలో రెండు, జ్యోతిష్మతిలో ఒకటి, కరీంనగర్‌లోని విట్స్ కళాశాలలో ఒక సెంటర్‌ను ఏర్పాటు చేశారు. శుక్రవారం మొత్తం ఆరు సెంటర్లలో ఉదయం పూట మాత్రమే పరీక్షలు నిర్వహించారు. 1817 మందికి అధికారులు ఏర్పాట్లు చేయగా 1672 మంది హాజరయ్యారు. 145 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగింది. మండలంలోని వాగేశ్వరి ఆయాన్ సెంటర్‌లో ఉదయం 750 మందికి గాను 689 మంది హాజరుకాగా, 61 మంది గైర్హాజరయ్యారు. వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో 320 మందికి గాను 291 మంది హాజరుకాగా, 29 మంది గైర్హాజరయ్యారు. జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో 160 మందికి గాను 149 మంది హాజరుకాగా, 11 మంది గైర్హాజరయ్యారు. చైతన్య-1లో 280 మందికి గాను 255 మంది హాజరుకాగా 25 మంది గైర్హాజరయ్యారు. చైతన్య-2లో 157 మందికి గాను 149 మంది హాజరుకాగా, 8 మంది గైర్హాజరయ్యారు. కరీంనగర్‌లోని విట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో 150 మందికి గాను 139 మంది హాజరుకాగా 11 మంది గైర్హాజరైనట్లు పరీక్ష నిర్వాహకులు తెలిపారు.

86
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles