28న శభాష్ బిడ్డా కార్యక్రమం

Sat,May 25, 2019 01:48 AM

ముకరంపుర: 2018-19 పదో తరగతి పరీక్షల్లో జిల్లాలోని (24) ప్రభుత్వ, కేజీబీవీ, మోడల్, ఎయిడెడ్ పాఠశాలల నుంచి 72 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించగా, ఈ విద్యార్థులకు ఈ నెల 28న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో శభాష్ బిడ్డా అనే కార్యక్రమం రూపొందించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామనీ, 10 జీపీఏ సాధించిన 72 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు, 24 మంది ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ అభినందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వాన పత్రికలు రూపొందించి, 72 మంది విద్యార్థులకు మండల విద్యాధికారుల ద్వారా అందజేస్తామని చెప్పారు. ప్రత్యేక ఎంట్రీపాసులను కూడా అందజేస్తామని పేర్కొన్నారు. కెరీర్ కౌన్సెలింగ్ కార్యక్రమం, కలెక్టర్‌తో కలసి భోజనం కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థులందరూ పాల్గొనాలని తెలిపారు.

90
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles