నేటితో గడువు ముగింపు

Sat,May 25, 2019 01:48 AM

సుభాష్‌నగర్: తెలంగాణ రాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ (హైదరాబాద్) కమిషనర్ 2019-20 విద్యాసంవత్సరానికిగానూ జిల్లాలో బెస్ట్ అవెలబుల్ స్కూల్‌లో 3, 5,8వ తరగతుల్లో గిరిజన విద్యార్థుల నుంచి ప్రవేశాల కోసం ఈ నెల 25 (శనివారం) సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి సంక్షేమ శాఖ కార్యాలయం అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 3,5,8 తరగతుల్లో అయిదు (5) సీట్లు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులు కరీంనగర్ జిల్లాకు చెందిన వారై ఉండి, వారి తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారి వార్షికాదాయం రూ 1.50 లక్షల లోపు ఉన్న షెడ్యూల్ తెగల (ఎస్టీ) కుటుంబాలకు చెందిన వారై ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తులు జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ నెల 31న అయా పాఠశాలల్లో ప్రవేశాలకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తామనీ, ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ప్రవేశం ఉంటుందని వివరించారు. దరఖాస్తు ఫారాలను పూర్తిచేసి ఆదాయం, కులం, జనన ధ్రువీకరణ, స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతోపాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో శనివారం 5 గంటలలోపు కరీంనగర్‌లోని జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించవచ్చని సూచించారు. వివరాలకు జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయంలో లేదా 0878-2242208లో సంప్రదించాలన్నారు.

80
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles