భారీ మెజార్టీతో వినోద్ గెలుపు ఖాయం

Thu,May 23, 2019 01:07 AM

గంగాధర: కరీంనగర్ ఎంపీగా బోయినిపల్లి వినోద్‌కుమార్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృ ద్ధి, ప్రభుత్వం అమలు చేసిన పథకాలను చూసే ప్రజలు ఓటేశారని ఉద్ఘాటించారు. మండలంలోని బూరుగుపల్లిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి గానీ, కరీంనగర్ నియోజకవర్గానికి కాని గత ప్రభుత్వాలు చేసింది ఏమి లేదనీ విమర్శించారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అభివృద్ధ్ది జరిగిందన్నారు. 10 లక్షల జనాభా ఉన్న నగరాలకు మాత్రమే వచ్చే స్మార్ట్ సిటీని మూడున్నర లక్షల జ నాభా మాత్రమే ఉన్న కరీంనగర్ నగరానికి తీసుకువచ్చిన ఘనత వినోద్‌కుమార్‌కే దక్కుతుందన్నారు. జాతీయ రహదారలంటే తెలియని కరీంనగర్ జిల్లాలో 3500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు మంజూరు చేయించారని, సీఎం కేసిఆర్ కలల ప్రాజెక్టు కొత్తపల్లి మనోహరాబాద్‌కు 750 కోట్ల నిధులు మంజూరు చేయించారని గుర్తు చేశారు. చొప్పదండికి సైనిక్ స్కూల్‌ను మం జూరు చేయించారన్నారు. గులాబీ జోరులో ప్రతి పక్షాలు గల్లంతుకావడం ఖాయమని చెప్పారు.

106
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles