టెన్త్‌ తర్వాత..?

Tue,May 21, 2019 01:29 AM

-విద్యార్థి భవితకు ఇదే కీలక దశ
-ఎంపిక విధానంలో స్వీయ సమీక్ష తప్పనిసరి
-తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తే అసలుకే మోసం
-బలాలు, బలహీనతలు బేరీజుతో మార్గం సుగమం

కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌;విద్యార్థి జీవితంలో పదో తరగతి దశ ఎంత కీలకమైందో తరువాత ఎంచుకునే మార్గం అంతకంటే ముఖ్యమైంది.. ఇప్పుడు తీసుకునే నిర్ణయమే వారి జీవితాలను మలుపులు తిప్పుతుంది.. బలాలు, బలహీనతలు, కష్ట నష్టాలను బేరీజు వేసుకుని స్వీయ సమీక్ష చేసుకుని ఎంపిక చేసుకుంటే నిర్దేశిత లక్ష్యం చేరేందుకు మార్గం సుగమమవుతుంది. ఈ నేపథ్యంలో పది తర్వాత ముఖ్యమైన కోర్సులు ఏంటి..? ఏం చదవాలి..? ఏది ఎంపిక చేసుకుంటే భవిష్యత్‌లో రాణించే అవకాశం ఉన్నది?లాంటి అంశాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..

స్వీయ సామర్థ్యాలను మదింపు చేసుకొని అన్ని కోణాల్లో విశ్లేషించి, అభిరుచికి అనుగుణంగా అడుగులేస్తే కెరీర్‌లో రాణించేందుకు వీలవుతుంది. అయితే ఏ నిర్ణయం తీసుకునప్పటికీ బాగా ఆలోచించిన తర్వాతే అడుగులేయాలి. కోర్సులను ఎంపిక చేసుకునేటప్పుడు అనేక జా గ్రత్తలు తీసుకోవాలి. గుడ్దెద్దు చేలో పడ్డట్టు ఏదో ఒక కోర్సులో చేరితే అసలుకే ఎసరురావచ్చు. అంటే బైపీసీలో చేరడానికి కారణం లె క్కలంటే ఇష్టం లేక పోవడం కాకుడదు.. భవిష్యత్తులో డాక్టర్‌ కావడమో, వ్యవసాయ కో ర్సుల్లో రాణించడమో లక్ష్యంతో చేరాలి. తన కు ఈ సబ్జెక్టు ఆసక్తికరమో కాదో తెలుసుకుని ముందుకెళ్లాలి.

ఇతరుల ప్రభావం..
సాధారణంగా గ్రామీణ విద్యార్థులు గ్రూపుల ఎంపికలో ఇతరుల ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుం ది. ఎంపీసీ చదివితే అన్ని విధాలుగా బాగుంటుందని ఎక్కువ మంది పెద్దల అభిప్రాయం. కొంత వరకు అది నిజమే కావచ్చు. అయితే పెద్దలు చెప్పారని నిర్ణయం తీసుకోవడం మా త్రం సరి కాదు. ఎందుకంటే లెక్కలు, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలపై పెద్దగా ఆసక్తి లేకపోతే ఎంపీసీ తీసుకోవడం వల్ల ఆశించిన ఫలితం దక్కదు. పెద్దల సూచనలు పాటిస్తూనే వ్యక్తిగత ఆసక్తికి ప్రాధాన్యతను ఇవ్వాలి. కొంత మంది మిత్రుల సహకారంతో, ఇంకొంత మంది తెలిసిన వాళ్లతో వారు సూచించే గ్రూపుల కాక అభీష్టానికి నచ్చిన కోర్సులను ఎంచుకుంటే మంచిది.

తల్లిదండ్రుల మార్గదర్శనం
పిల్లల కోర్సుల ఎంపికలో తల్లిదండ్రుల సహాయకులుగా ఉంటూ మార్గదర్శనం చేయాలే తప్ప వ్యక్తిగత అభిప్రాయాలను రుద్దకూడదు. సా ధారణంగా విద్యార్థుల చదువుల విషయంలో తల్లిదండ్రుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప క్కవారి లాగా అని.. తెలిసిన వారి పిల్లలు ఇలా స్థిరపడ్డారని వారిని పోల్చుతూ ఉంటా రు. కానీ, తమ పిల్లలకి ఇష్టమైన విషయం ఏంటి? అని అడిగే వారు అరుదు. అలా కాకుండా వారికి నచ్చిన కోర్సుల్లో వారిని ప్రోత్సహించడం ఉత్తమం.

సీఏ చేసేందుకు ఎంపీసీ, ఎంఈసీల్లో ఏది మంచిది..
పదో తరగతి తర్వాత సీఏ కోర్సులో చేరాలని ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంఈసీ కోర్సుల్లో చేరడం ఉత్తమం. ఈ గ్రూపులో ఉండే మాథ్స్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌ విషయాలన్నీ సీఏ ఫౌండేషన్‌తో పాటు మిగతా సీఏ కోర్సుల్లోనూ పనికొస్తాయి. అదే ఎంపీసీ అయితే ఫిజిక్స్‌, కెమిస్ట్రీలతో సీఏలో ఎలాంటి ప్రయోజనమూ దక్కదు. కాబట్టి సీఏ కోసం ఎంఈసీ కోర్సు ఎంతో ఉత్తమం. కాబట్టి కోర్సులో చేరేముందు కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి.

119
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles