కౌంటింగ్‌కు విస్తృత ఏర్పాట్లు

Mon,May 20, 2019 03:41 AM

-పకడ్బందీగా పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
-ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బంది కేటాయింపు
- కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
-ఎస్‌ఆర్‌ఆర్‌లో ఏర్పాట్ల పరిశీలన
(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ);పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌కు విస్తృత ఏర్పా ట్లు చేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించారు. కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఆదివారం సాయంత్రం కలెక్టర్ సందర్శించారు. ఏ ర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్, హు స్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ సెగ్మెంట్ల పరిధిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేశామని తెలిపారు. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు వెళ్లేందుకు ప్రత్యేక దారులు ఏర్పాటు చేయాలని సంబంధిత అ ధికారులను ఆదేశించారు. బార్‌గేటింగ్ పకడ్బందీగా ఉండాలని సూచించారు. ప్రతీ నియోజకవర్గం కౌం టింగ్ హాలులో 14 టేబుళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్ సందర్భంగా విధులను ని ర్వహించే సిబ్బందికి డ్యూటీ పాసులను జారీ చేయాలని వివరించారు. ఉదయం 8.00 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ముగించాలని, 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. కలెక్టర్ వెంట ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రావీణ్య, జేసీ శ్యాంప్రసాద్ లాల్, సిరిసిల్ల జేసీ యాస్మీన్‌బాషా, డీఆర్వో భిక్షానాయక్, అసిస్టెం ట్ రిటర్నింగ్ అధికారులు వెంకటమాధవరావు, వెం కటేశ్వర్‌రావు, చెన్నయ్య, ఆనంద్‌కుమార్ పోలీసు అధికారులు తదితరులున్నారు.

పకడ్బందీగా నిర్వహించాలి..
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మానకొండూర్, హుజూరాబా ద్ నియోజకవర్గాల కౌంటింగ్ సిబ్బందికి ఆదివా రం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కౌం టింగ్ రోజు సిబ్బంది మొత్తం ఉదయం 5.00 గంటల వరకే తమ కేం ద్రాలకు వెళ్లాలని సూచించారు. ఏ నియోజకవర్గం ఏ టేబుల్ కేటాయిస్తారో ముందుగానే తెలియ జేయాలని, ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందిని కే టాయిస్తామన్నారు. కౌం టింగ్ సందర్భంగా తమ టేబుల్‌పైకి వచ్చిన సీయూలో ఏవైనా సాంకేతిక సమస్యలున్నట్లతే వెంటనే ఏఆర్వో దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ప్రతి నియోజకవర్గానికీ 5 పోలింగ్ స్టేషన్ల వీవీ ప్యాట్లను లెక్కించాల్సి ఉంటుందన్నా రు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలని, ఎ న్నికల కమిషన్ ఆదేశాలను తూ.చ తప్పక పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రావీణ్య, డీఆర్వో భిక్షానాయక్, ఏఆర్వోలు వెంకటమాధవరావు, ఆనందర్‌కుమా ర్, చెన్నయ్య, డీఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు..

147
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles