న్యూజిలాండ్‌లో జిల్లా వాసికి జైలు

Fri,May 17, 2019 01:21 AM

- లైంగిక వేధింపుల కేసులో 14 ఏళ్ల శిక్ష
కరీంనగర్‌ క్రైం : ఉన్నత చదువులు, ఉన్నతమైన పదవులు.. ఇవన్నీ ఉన్నా.. అభం శుభం తెలియని పదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. ఆ చిన్నారి మతిస్థిమితం కోల్పోయి చిట్ట చివరకు యుక్త వయసులో విషయం బయట పెట్టడంతో కేసు నమోదు చేసిన న్యూజిలాండ్‌ పోలీసులు నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు. నేరం రుజువైనా ఆ నిందితుడిలో పశ్చాత్తాపం కూడా కన్పించడం లేదని 14 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌లోని విద్యారణ్యపురికి చెందిన సర్వాజీ సీతారామారావు ఉన్నతచదువుల కోసం న్యూజిలాండ్‌ వెళ్లాడు. అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించాడు. కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 19 ఏళ్ల క్రితం న్యూజిలాండ్‌ వెళ్లిన ఆయన 2003లో పదేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఘ టన జరిగిన తర్వాత ఆ చిన్నారి విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. ఆమె తల్లిదండ్రులు చికిత్స చేయించినా ఫలితం లేకపోగా వయసు పెరిగే కొద్ది ఆమె ప్రవర్తన మరింత దీనంగా త యారైంది. యుక్త వయసుకు చేరుకున్న ఆ యువతిని మానసిక నిపుణుల సమక్షంలో కౌన్సెలింగ్‌ చేయగా, చిన్న వయసులో జరిగిన ఆ ఘటనను బయట పెట్టింది. ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో వారిచ్చిన సమాచారం మేరకు సీతారామారావుపై 2017లో కేసు నమో దు చేశారు. తనకున్న అధికార అండదండలతో కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేసి నా న్యాయస్థానం అతను చేసిన పనికి క్షమించలేకపోయింది. నేరం రుజువు కావడంతో న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌ కోర్టు న్యాయమూర్తి 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 19 ఏళ్లుగా న్యూజిలాండ్‌లోనే స్థిరపడిన సీతారామారావు గతేడాది కు టుంబ సభ్యులను కూడా అక్కడికే తీసుకెళ్లాడు. రెండేళ్ల క్రితం బంధువుల శుభకార్యం కోసం కరీంనగర్‌కు వచ్చాడనిఆయన గురించి తెలిసిన వారు చెప్పారు.

138
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles