పసుపు కొనుగోళ్లు షురూ

Thu,May 16, 2019 01:18 AM

- జమ్మికుంట మార్కెట్‌లో ప్రారంభించిన మార్కెట్‌ చైర్‌ పర్సన్‌ శారద, కార్యదర్శి రెడ్డి నాయక్‌
-పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్‌
- పసుపు కొనేందుకు తరలివచ్చిన వరంగల్‌ వ్యాపారులు
- తొలిరోజు పోటాపోటీ కొనుగోళ్లు
- గరిష్ఠ ధర రూ.5811
జమ్మికుంట: పట్టణంలోని పాత వ్యవసాయ మా ర్కెట్‌ యార్డులో బుధవారం పసుపు కొనుగోళ్లు షురూ అయ్యాయి. మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ పొనగంటి శారద-మల్లయ్య, కార్యదర్శి రెడ్డి నాయక్‌ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. కొనుగోళ్ల తీరును రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పరిశీలించారు. పసుపు మార్కెట్‌కు తరలివచ్చిన వరంగల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కుమారస్వామి, వ్యాపారులు, అమ్మకానికి తెచ్చిన రైతులతో మంత్రి మాట్లాడారు. అంతకుముందు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ శారద ఆధ్వర్యంలో వైస్‌ చైర్మన్‌ మల్లారెడ్డి, డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది, రైతులు ప్రత్యేక పూజలు చేశారు. కొనుగోళ్ల కోసం కేటాయించిన 8,9వ గద్దెలు అమ్మకానికి వచ్చిన పసుపుతో నిండిపోయాయి. ఇక్కడి వ్యాపారులకు పసుపు కొనుగోళ్లపై అనుభవం, అవగాహన లేకపోవడంతో.. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ కుమారస్వామి ఆధ్వర్యంలో వరంగల్‌ నుంచి వ్యాపారు లు మార్కెట్‌కు తరలివచ్చారు.

పసుపు క్రయవిక్రయాలపై అవగాహన కల్పించారు. తర్వాత వ్యాపారులు పాటలో పాల్గొన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లికి చెందిన రాజయ్య అనే రైతుకు చెందిన పసుపునకు క్వింటల్‌కు గరిష్ట ధర రూ.5811పలికింది. ప్రారంభమైన తొలిరోజున వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేయడంతో అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. ఇక్కడ మున్సిపల్‌ చైర్మన్‌ శీలం శ్రీనివాస్‌, జిల్లా రైస్‌ మిల్లర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బచ్చు భాస్కర్‌, మార్కెట్‌ డైరెక్టర్లు సయ్యద్‌ ముజీబ్‌ హుస్సేన్‌, సంతోశ, బుచ్చయ్య, సార య్య, అశోక్‌, రాజు, శ్రీనివాస్‌రెడ్డి, బాబుశెట్టి, అడ్తిదారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శివశంకర్‌, వ్యాపారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

86
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles