బెస్ట్‌ అవెలెబుల్‌ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులు..

Thu,May 16, 2019 01:16 AM

సుభాష్‌నగర్‌: బెస్ట్‌ అవెలెబుల్‌ స్కూళ్లలో 2019-20 విద్యాసంవత్సరానికి గాను ఒక టి, 5 వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జి ల్లాకు చెందిన ఎస్సీ విద్యార్థులకు ప్రవేశానికి అవకాశం ఉందన్నారు. 1, 5 తరగతుల్లో 34 సీట్ల చొప్పున భర్తీ చేయనున్నామని పేర్కొన్నారు. 1వ తరగతిలో నాన్‌ రెసిడెన్షియల్‌ స్కీం కింద ప్రవేశం పొందిన విద్యార్థులకు హాస్టల్‌ వసతి ఉండదన్నారు. 5 వ తరగతిలో రెసిడెన్షియల్‌ కింద ప్రవేశం పొందిన వారికి హాస్టల్‌ వసతి ఉంటుందని పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకునే విద్యార్థులు జిల్లాకు చెందిన వారై ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాం తాల విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదా యం రూ.2 లక్షల్లోపు ఉండాలన్నారు. ప్రవేశానికి విద్యార్థులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఈ స్కూళ్లలో అగ్రికల్చర్‌ లేబర్‌, మొదటి తరం అక్షరాస్యత కల్గిన కుటుంబాల పిల్లలకు 50 శాతం, అనాథ పిల్లలకు 20 శాతం, జోగినీల పిల్లలకు 15 శాతం, బాండెడ్‌ లేబర్స్‌కు 15 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయన్నారు. ఈ ప్రకారమే సీట్లను భర్తీ చేస్తామని చెప్పారు.

దరఖాస్తులను ఈ నెల 16 నుంచి జిల్లా ఎస్సీ సంక్షేమశాఖాధికారి కార్యాలయంలో లభించనున్నాయన్నారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను కుల, ఆదాయం, నివాసం, రేషన్‌కార్డు, జనన సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డులతో జూన్‌ 6 వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా కలెక్టరేట్‌లోని షెడ్యూల్డ్‌ కులాల సంక్షే మ శాఖాధికార్యాలయంలో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు సంబం ధింత శాఖాధికారులను సంప్రదిం చాలని కోరారు.

78
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles