టీవీవీ మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థే

Thu,May 16, 2019 01:14 AM

-విద్యార్థులు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు
-సీపీ కమలాసన్‌రెడ్డి
కరీంనగర్‌ క్రైం/టవర్‌సర్కిల్‌ : తెలంగాణ విద్యార్థి వేదిక సంస్థ మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థగా పని చేస్తున్నట్లు గుర్తించామని సీపీ కమలాసన్‌రెడ్డి ప్రకటించారు. రెండ్రోజులుగా శాతవాహన యూనివర్సిటీలో టీవీవీ కార్యాకలాపాలపై వస్తున్న ఊహాగానాలకు సీపీ తెరదించారు. బుధవారం కమిషనరేట్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడారు.

నక్సల్స్‌ బాధిత కుటుంబాల సంక్షేమ సంఘం పేరిట సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పుకార్లకు, పోలీసులకు సంబంధం లేదన్నారు. నక్సల్స్‌ బాధిత కుటుంబాల సంక్షేమ సంఘం పోలీసుల సృష్టి కాదనీ, టీవీవీ సంస్థకు నక్సల్స్‌తో సంబంధాలున్న విషయంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఛత్తీస్‌గడ్‌లోని కుంట పోలీస్‌స్టేషన్‌లో టీవీవీ నేత ఎండీ నజీర్‌పై కేసు నమోదైందనీ, రాష్ట్ర కార్యదర్శి మహేశ్‌పై కూడా కేసులున్నట్లు తెలిసిందన్నారు.

90
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles