సిమెంట్‌ గోలెంలో పడి బాలుడు మృతి

Thu,May 16, 2019 01:12 AM

ఇల్లందకుంట: ఇంటి వద్ద ఆడుకుంటున్న ఓ బాలుడు ప్రమాదశాత్తూ సిమెంటు గోలెంలో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఇల్లందకుంట మండలంలోని శ్రీరాంలపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ ప్రవీణ్‌రాజు కథనం ప్రకారం.. శ్రీరాంలపల్లి గ్రామానికి చెందిన తిప్పారపు సదయ్య- రాజేశ్వరి దంపతులకు ఒక్క కూతురు, కొడుకున్నారు. కాగా, బుధవారం వారు శివకుమార్‌ (3)ను ఇంటి వద్ద ఉంచి కూలీ పనులకు వెళ్లారు. ప్రతిరోజూ సదయ్య తల్లి వద్ద శివకుమార్‌ను అప్పగించి వెళ్లేవారు కానీ, బుధవారం ఇంటివద్దే వదిలివెళ్లగా బాలుడు ఇంటి వద్ద ఆట ఆడుకుంటూ సిమెంటు గో లెం వద్దకు చేరుకు న్నా డు. గోలెంపైకి ఎక్కగా ప్రమాదశాత్తు తలకిందులుగా పడిపోయాడు.

తల్లిదండ్రులు వచ్చి వెతకగా గోలెంలో శవమై కనిపించాడు. విగతజీవిగా కనిపించిన కొడుకును చూసి వారు గుండెలవిసేలా రోదించా రు. సదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌రాజు తెలిపారు.

82
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles