ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య

Thu,May 16, 2019 01:11 AM

ఇల్లందకుంట: ఆర్థిక ఇబ్బందులతో ఓ వివాహిత ఇంటిలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని లక్ష్మాజీపల్లిలో బుధవారం జరిగింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .... లక్ష్మాజీపల్లికి చెందిన చిలు క ఐలయ్య - అనిత దంపతులకు కూతురు, కు మారుడు ఉన్నారు.

కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. నాలుగు సంవత్సరాల కింద అప్పులు చేసి కూతురు వివాహం జరిపించారు. ఐలయ్య ఎలాంటి పనిచేయకుండానే ఇంటి వద్దనే ఉంటున్నాడు. కూతురు వివాహనికి తీసుక వచ్చిన అప్పులు చెల్లించలేక తీవ్ర మనస్థాపానికి గురై ఇంటిలో అనిత(39) ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. అనిత భర్త ఐలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తునట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌రాజు తెలిపారు.

66
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles