వడదెబ్బతో భజన మండలి సభ్యుడి మృతి

Thu,May 16, 2019 01:10 AM

హుజూరాబాద్‌టౌన్‌: పట్టణంలోని శివాజీనగర్‌కు చెందిన బూసారపు రాజీరు (83) అనే భజన మండలి సభ్యుడు వడదెబ్బతో బుధవారం ఇంటి వద్ద మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపా రు. వ్యవసాయ పనులు చేసుకోవడంతో పాటు శ్రీరామానంద భజన మండలి సభ్యుడిగా పలు దైవ కార్యక్రమాల్లో భజలు చేసేవాడు. ఇటీవల దగ్గరి బంధువుల పెళ్లి కోసం ఎండలో తిరుగుతు పలు పనులు చేయడంతో వడదెబ్బబారిన పడ్డా రు. ఇంటివద్ద తీవ్ర అస్వస్థకు గురికావడంతో ద వాఖానలో చికిత్స చేయించారు. ఈ క్రమంలో ఇంటికి తీసుకురాగా చికిత్స పొందుతూ మధ్యా హ్నం మృతి చెందాడు. ఆయ నకు భార్య మల్లమ్మ ఉన్నారు. ఆయన మృతదేహంపై పడి బంధు వులు రోదించారు.

గుర్తు తెలియని వ్యక్తి..కరీంనగర్‌ క్రైం : నగరంలోని క్రిస్టియన్‌ కాలనీ సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల విచారించగా మృతునికి సం బంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలే దు. వడదెబ్బతో మృతి చెంది ఉంటాడని భావించిన పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలిం చారు. సంబంధీకులెవరైనా ఉంటే టూ టౌన్‌లో సంప్రదించాలని సీఐ దేవారెడ్డి తెలిపారు.

75
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles