రోడ్డు ప్రమాదంలో యువకులకు తీవ్ర గాయాలు

Thu,May 16, 2019 01:10 AM

హుజూరాబాద్‌టౌన్‌: పట్టణంలోని కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ ఎదురుగా బుధవారం రాత్రి ద్వి చక్రవాహనం అదుపు తప్పి డివైడర్‌కు ఢీకొన్న ఘటనలో తాళ్లపెల్లి రాకేశ్‌(28), అతడి స్నేహితుడు అంజన్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మానకొండూర్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన తాళ్లపెల్లి రాకేశ్‌ చెల్లె పెళ్లి గురువారం ఉండగా హుజూరాబాద్‌లో ఫ్లెక్సీ కొట్టించి తీసుకెళ్లేందుకు అతడి స్నేహితుడు అంజన్‌ కుమార్‌తో కలసి పల్సర్‌ బండిపై వచ్చారు.

ఫ్లె క్సీలు తీసుకొని తిరిగి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తుండగా కరీంనగర్‌రోడ్‌లోని కేడీసీసీబీ బ్యాంక్‌ ఎదురుగా అదుపు తప్పి డివైడర్‌కు ఢీకొట్టి ఎగిరి పడ్డారు. దీంతో అంజన్‌కుమార్‌కు, రాకేశ్‌కు తీవ్ర గాయాలు కాగా వెంటనే బ్లుకోల్ట్స్‌ సిబ్బంది వచ్చి క్షతగాత్రులను ప్రభుత్వ దవాఖానకు తరలిం చారు. ఇందులో రాకేశ్‌ తీవ్ర గాయాలై తీవ్ర రక్తస్రావం జరుగుతుందనీ, ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కల్వర్టును ఢీకొని కారు బోల్తా..
మానకొండూర్‌: మండలకేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో బుధవారం వేకువజామున 5 గంటలకు కరీంనగర్‌-వరంగల్‌ రహదారిపై కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన బాలరాజు (35) తన కారు ( ఏపీ 36 ఎల్‌ 3834)లో వరంగల్‌ నుంచి కరీంనగర్‌ వైపు వస్తున్నాడు. మండలంలోని వన్నారం గ్రామానికి చెందిన పొలాడి వెంకటరమణారావు (50) కరీంనగర్‌ వెళ్లేందుకు గట్టుదుద్దెనపల్లి స్టేజివద్ద వేచి చూస్తున్నాడు.

ఈక్రమంలో వరంగల్‌ వైపు నుంచి వస్తున్న బాలరాజు కారులో వెంకటరమణారావు ఎక్కాడు. అతివేగంగా, అజాగ్రత్తగా కారు నడుపుతున్న బాలరాజు మానకొండూర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో రొడ్డుప్రక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టడంతో కారు రొడ్డుపై బోల్తాపడింది. ఈప్రమాదంలో వెంకటరమణారా వు గాయపడగా ఆయన్ను స్థానికులు చికిత్స కో సం కరీంనగర్‌ వైద్యశాలకు తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో కారును రొడ్డుపై నుంచి తొలిగించారు.

85
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles