మూడో మోటర్‌కు వెట్న్‌ నేడు

Wed,May 15, 2019 01:30 AM

-నందిమేడారం పంప్‌హౌస్‌లో అంతా సిద్ధం
-ఉదయం 11 గంటల తర్వాత ఎత్తిపోతల పరీక్ష
-వీలైతే నాలుగోది నిర్వహించే అవకాశం
-మేడారం రిజర్వాయర్‌లోకి నీటి తరలింపు
-నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ, సీఎంవో ఓఎస్డీ, లిఫ్ట్‌ అడ్వైజర్‌ రాక
పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ ధర్మారం: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం శరవేగంగా తుది దశకు చేరుకున్నది. రికార్డు స్థాయిలో నిర్మాణాలు పూర్తి కాగా, నీటి తరలింపు ప్రక్రియలో వేగం పుంజుకున్నది. ఆరో ప్యాకేజీలో భాగంగా ధర్మారం మండలం నందిమేడారం వద్ద భూగర్భాన నిర్మితమైన పంప్‌హౌస్‌లో మొత్తం ఏడు మోటర్లు ఏర్పాటు చేస్తుండగా, ఇందులో నాలుగు మోటర్ల బిగింపు ప్రక్రియ పూర్తయింది. ఐదో మోటర్‌ చివరి దశలో ఉండగా, 6,7 పంపుల బిగింపు జరుగుతున్నది. ఒక్కో మోటర్‌ 127.6 మెగావాట్ల సామర్థ్యం ఉన్నవి. అయితే కాళేశ్వరం నీటిని రైతాంగానికి త్వరగా అందించాలన్న సంకల్పంతో చివరి అంకాలైన పనులను యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. గత నెలలో ఎల్లంపల్లి జలాశయం నుంచి నందిమేడారం సర్జ్‌పూల్‌లోకి నీటిని విడుదల చేశారు. సాంకేతికంగా అన్నీ పరీక్షలు పూర్తిచేసుకున్న తర్వాత ఏప్రిల్‌ 24న మొదటి, 25న రెండో మోటర్‌ వెట్న్‌న్రు విజయవంతంగా నిర్వహించి రికార్డు సృష్టించారు. సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ స్విచ్‌ఆన్‌ చేసి వెట్న్‌న్రు ప్రారంభించగా, ఒక్కో మోటర్‌ 3,200 క్యూసెక్కుల నీటిని నందిమేడారం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసింది.

నేడు మూడో మోటర్‌కు పరీక్ష
మొదటి, రెండో మోటర్లు విజయవంతంగా నీటిని ఎత్తిపోయగా, తాజాగా 3, 4 మోటర్లను పరీక్షించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. నేటి (బుధవారం) ఉదయం 11 గంటల తర్వాత స్విచ్ఛాన్‌ చేసి మూడో భారీ మోటర్‌ను ప్రారంభించనున్నారు. వీలైతే నాలుగో మోటర్‌ కూడా వెట్న్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రాజెక్ట్‌ ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఈఈ నూనె శ్రీధర్‌, ఏఈలు టన్నెల్‌లోనే మకాం వేసి, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే రెండు మోటర్లకు సర్జ్‌పూల్‌ నుంచి డ్రాఫ్ట్‌ ట్యూబ్‌ గేట్ల ద్వారా నీటిని పంపి పరీక్షించిన అధికారులు, విద్యుత్తు సరఫరా, చార్జింగ్‌ వంటి సాంకేతికంగా పరీక్షలు పూర్తి చేసి, అంతా సవ్యంగా ఉందన్న నిర్ధారణకు వచ్చారు. ముందుగా మూడో మోటర్‌ను వెట్న్‌ చేయాలని నిర్ణయించారు. వీలైతే నాలుగో మోటర్‌ను కూడా వెట్న్‌ చేయాలని భావిస్తున్నారు.

ప్రారంభోత్సవానికి ప్రముఖులు..
వెట్న్‌క్రు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ప్రారంభోత్సవానికి నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు, సీఎంఓ ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, ఎత్తిపోతల పథకం సలహాదారు పెంటారెడ్డి హాజరుకానున్నట్లు ప్రాజెక్టు ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు తెలిపారు. నేటి ఉదయం 11 గంటలకు మూడో మోటర్‌ను స్విచ్‌ ఆన్‌ చేసి ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. 1,2 మోటర్ల మాదిరిగానే మూడో మోటర్‌ నుంచి 3,200 క్యూసెక్కుల నీరు డెలివరీ సిస్టర్న్‌ ద్వారా బయటికి వచ్చి, నందిమేడారం రిజర్వాయర్‌కు చేరుతుందని చెప్పారు.

171
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles