తప్పితే ముప్పేం లేదు

Mon,May 13, 2019 03:48 AM

చొప్పదండి,నమస్తేతెలంగాణ: పదో తరగతి విద్యార్థులు పరీ క్షా ఫలితాల్లో తప్పినా వచ్చే ముప్పేంలేదు.. ఆత్మైస్థెర్యాన్ని కోల్పోయి విలువైన భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు.. అంటూ విద్యాధికారి రాజస్వామి పిలుపునిచ్చారు. మండలంలోని రాగంపేట, కాట్నపల్లి జిల్లా పరిషత్ పాఠశాలల్లో పది విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఫలితాలపై ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాగంపేటలో ఆయన మా ట్లాడుతూ పదవ తరగతి జీవితంలో ఒక భాగం మాత్రమేనని, తల్లిదండ్రులు తమ పిల్లలను మార్కుల విషయంలో ఒత్తిడికి గురిచేయవద్దని కోరా రు. తమ పిల్లల మార్కులకు ఇతర పిల్లలలతో పోల్చవ ద్దని సూచించారు. సర్పంచ్ మామిడి లత, హెచ్‌ఎం రవీందర్, రామయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అధైర్యపడవద్దు..
గంగాధర: పదో తరగతి విద్యార్థులకు మండలంలోని ఉప్పరమల్యాల, గర్శకుర్తి ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నర్సింహరెడ్డి, అశోక్‌రెడ్డి మాట్లాడుతూ 10వ తరగతిలో వచ్చిన ఫలితాలను చూసి అధైర్య పడవద్దన్నారు. విద్యార్థి జీవితంలో 10వ తరగతి ఒక భాగం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఇప్పటి నుండే ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు. సర్పంచులు అలువాల నాగలక్ష్మి, బొల్లాడి మంజుల, నాయకులు అలువాల తిరుపతి, బొల్లాడి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

161
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles