బాకీపడ్డ బతుకులు నాటికకు రెండు బహుమతులు

Sun,May 12, 2019 12:39 AM

హుజూరాబాద్‌టౌన్: హైదరాబాద్‌లోని రామచంద్రాపురం బీహెచ్‌ఈఎల్ కమ్యూనిటీ సెంటర్‌లో ఈ నెల 2 నుంచి 10 వరకు నిర్వహించిన 45వ జాతీయస్థాయి తెలుగు నాటికల పోటీల్లో హుజూరాబాద్‌కు చెందిన కాకతీయ కళా సమితి వారు ప్రదర్శించిన సాంఘిక నాటిక బాకీపడ్డ బతుకులు రెండు బహుమతులు గెలుచుకున్నది. నాటికలో భుజంగం పాత్రలో నటించిన మూదాం కుమారస్వామి ఉత్తమ విలన్‌గా, పంతుల పాత్రలో నటించిన బండ కిషన్‌కు స్పెషల్ జ్యూరీ అవార్డులు వచ్చినట్లు కాకతీయ కళాసమితి నిర్వాహకుడు కుడికాల ప్రభాకర్ శనివారం తెలిపారు. పట్టణానికి చెందిన నంది అవార్డు గ్రహీత రావుల పుల్లాచారి రాసిన బాకీపడ్డ బతుకులు నాటికకు ఇదే పట్టణానికి చెందిన బండ కిషన్ దర్శకత్వం వహించారు. ఈ నాటికలో మూదాం కుమారస్వామి, బండ కిషన్‌తోపాటు కుడికాల ప్రభాకర్, తాళ్లపెల్లి శ్రీనివాస్, కుంట తిరుపతిరెడ్డి, మడిపల్లి రాములు, వల్బాపూర్ ప్రభు, సురభి యామినిలు ఇందులో నటించి ప్రతిభ కనబర్చారని చెప్పారు. కాకతీయ కళాసమితి కళాకారులకు జాతీయస్థాయిలో అవార్డులు రావడం పట్ల పలువురు కళాకారులు, కవులు, రచయితలు హర్షం వ్యక్తం చేశారు.

75
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles