డెస్క్ జర్నలిస్టులపై హెడ్‌కానిస్టేబుల్ దాడి

Sun,May 12, 2019 12:39 AM

కరీంనగర్ క్రైం: ఓ దినపత్రికలో డెస్క్ జర్నలిస్టులుగా పని చేస్తున్న ఇద్దరిపై శుక్రవారం అర్ధరాత్రి ఓ హెడ్ కానిస్టేబుల్, అతడి తనయులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ దినపత్రిక డెస్క్ జర్నలిస్టులు సీహెచ్ రాములు, టీ వెంకటేశ్ శుక్రవారం అర్ధరాత్రి విధులు ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కోతిరాంపూర్ వద్ద మద్యం తాగిన హెడ్ కానిస్టేబుల్ పద్మారావు, అతడికొడుకు, బంధువులు అకారణంగా అడ్డుకుని నిర్భందించి, దాడి చేశారు. ఈ దాడిలో రాములు తప్పించుకుని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై హెడ్ కానిస్టేబుల్, అతడి కొడుకు, బంధువులపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. కాగా, డెస్క్ జర్నలిస్టులపై దాడికి దిగిన హెడ్ కానిస్టేబుల్, కొడుకు, బంధువులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలనీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని టీయూడబ్ల్యూజే, కరీంనగర్ జిల్లాశాఖ కోరింది. సీఐని కలిసిన వారిలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, జానంపేట మారుతి, కోశాధికారి శరత్‌రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులున్నారు.

69
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles