వడదెబ్బతో ముగ్గురు మృతి

Sun,May 12, 2019 12:39 AM

హుజూరాబాద్ రూరల్: మండలంలోని బొత్తలపల్లి గ్రామంలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. పోతరవేణి ఎల్లమ్మ(65) అనే మహిళ వ్యవసాయ పనులకు పోయి వచ్చి అస్వస్థతకు గురై మృతి చెందింది. ఆమెకు ఇద్దర కొడుకులున్నారు. అలాగే, ఎరుకొండ లచ్చమ్మ(75) అనే వృద్ధురాలు ఇంటివద్దనే వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆమెకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లున్నారు. వారి కుటుంబాలను స్థానిక సర్పంచ్ సుంకరి స్వరూప పరామర్శించారు.
చిగురుమామిడి: మండలంలోని రామంచ గ్రామపంచాయతీ పరిధిలోని అంటకాలపల్లికి చెందిన గుండ తిరుపతి (40) వడదెబ్బతో శనివారం మృతి చెందాడు. కరీంనగర్‌లో సెంట్రింగ్ వర్క్ నిర్వహించే తిరుపతి రెండ్రోజుల క్రితం వడదెబ్బకు గురై అస్వస్థతకు గురయ్యాడు. శుక్రవారం జరిగిన పరిషత్ ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం దవాఖానకు వెళ్లి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు కొడుకులున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.

64
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles