ఎన్నికల్లో పోలీసుల పనితీరు భేష్

Sat,May 11, 2019 01:48 AM

చిగురుమామిడి : జిల్లా, మండల పరిషత్ సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో పోలీసుల పనితీరు బాగుందని సీపీ కమలాసన్‌రెడ్డి అన్నారు. రెండో విడుత ఎన్నికల సందర్భంగా శుక్రవారం మండల కేంద్రం చిగురుమామిడి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు ముందస్తుగా గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారనీ, ప్రజలు సహకరించారని పేర్కొన్నారు. ఎలాంటి గొడవలకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓట్లు వేసేందుకు ఉత్సాహంగా వచ్చారని అభినందించారు. అలాగే ప్రతి వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలన్నారు. హెల్మెట్ల వినియోగంపై ఎవరికీ, ఎక్కడా మినహాయింపు ఇవ్వలేదనీ, ద్విచక్రవాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వద్ద మొదటి సారిగా ఓటు వేసేందుకు వచ్చిన విద్యార్థినులతో ముచ్చటించారు. సీపీ వెంట ఏసీపీ కృపాకర్, ఎస్‌ఐ మామిడాల సురేందర్, పోలీసులు ఉన్నారు.

83
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles