కిలిమంజారో పర్వతారోహణకు ఎక్సైజ్ కానిస్టేబుల్

Sat,May 11, 2019 01:47 AM

కరీంనగర్ స్పోర్ట్స్: జిల్లాకు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ లెంకల మహిపాల్‌రెడ్డి అరుదైన ఘనతను సాధించాడు. ఈ నెల 13 నుంచి 25 వరకు అఫ్రికాలోని కిలిమంజారో పర్వతారోహణలోని బృం దంలో సభ్యుడిగా చోటు సంపాదించాడు. గతం లో పలుమార్లు ట్రెక్కింగ్‌ను సమర్ధవంతంగా నిర్వహించిన మహిపాల్‌రెడ్డి కిలిమంజారో పర్వతారోహణ కోసం అరుణాచల్‌ప్రదేశ్‌లో నెల రోజుల పా టు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఈ పర్వాతారోహణకు భారత్ నుంచి 12 మంది, ఇతర దేశాల నుంచి 10 మంది ఎంపికైనట్లు మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఎక్సైజ్ అధికారుల సహకారంతోనే ఈ ఘనతను సాధించానని మహిపాల్ తెలిపారు. శుక్రవారం ఆయనను ఉన్నతాధికారులు శాలువాలు, పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి, కరీంనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె చంద్రశేఖర్, పెద్దపల్లి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, సీఐ లు రాజేందర్‌రెడ్డి, విజయ్‌కుమార్, కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్ సంఘ నాయకులు పులి నగేశ్‌గౌ డ్, శ్రీకాంత్, గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు ఎన్‌పీఆర్ చంద్రశేఖర్, తాతాజి తదితరులు అభినందించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ నుం చి కిలిమంజారో పర్వతారోహణకు ఎంపికైన వారి లో ప్రథముడు మహిపాల్‌రెడ్డి కావడం విశేషం.

82
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles