లూపస్ అంటువ్యాధి కాదు

Sat,May 11, 2019 01:47 AM

ముకరంపుర: లూపస్ అనేది అంటువ్యాధికాదని రుమటాలజి నిపుణుడు డాక్టర్ మేఘనాథ్ తెలిపారు. శుక్రవారం ప్రపంచ లూపస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లూపస్ అనేది రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసే దీర్ఘకాలం వ్యాధి అని పే ర్కొన్నారు. ఈ వ్యాధిగ్రస్తులు అమెరికాలో లక్ష మందిలో 25 శాతం మంది ఉన్నారనీ, మన దే శంలో 1993లో నిర్వహించిన సర్వే ప్రకారం లక్ష లో 3 నుంచి 4 శాతం ఉంటారని తెలిపారు. ప్రపంచ లూపస్ దినోత్సవాన్ని యేటా మే 10న నిర్వహిస్తారని తెలిపారు. లూపస్ అంటువ్యాది కాదని, వంశపారంపర్యంగా రాదనీ, కాని తల్లిదండ్రుల నుంచి వచ్చిన జన్యువులు వ్యాధివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. వ్యాధి పట్ల అవగాహన లేకపోవడం, రోగ నిర్ధారణ చేయడంలో సగటున 6 సంవత్సరాలు అలస్యం అవుతుందన్నారు. లూపస్ ఏ వయస్సులోనైనా రావచ్చని, కానీ సర్వ సాధారణంగా 15-45 సంవత్సరాల మధ్యలో వ స్తుందన్నారు. గమనించి చికిత్స తీసుకోవాల న్నా రు. సమావేశంలో డాక్టర్ శాలోమ్, మల్లికార్జున్, కమలాకర్ తదితరలు ఉన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles