బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

Sat,May 11, 2019 01:47 AM

తిమ్మాపూర్ రూరల్: బాలికలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని జేసీ శ్యాంప్రసాద్‌లాల్ పిలుపు నిచ్చారు. మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతి బాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల పాఠశాలలో గత నెల 20వ తేది నుంచి నిర్వహిస్తున్న క్రీడా శిబిరం ముగింపు కార్యక్రమం శుక్రవారం ఏర్పాటు చేశారు. కాగా ముఖ్య అతిథిగా హాజరైన జేసీకి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నదనీ, వసతి గృహాల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని, భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. సాంఘిక సంక్షేమ, గురుకుల పాఠశాలల ద్వారా ఒక్కో విద్యార్థికి వేలల్లో ఖర్చు చేస్తూ కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్‌లో కరీంనగర్ గురుకుల విద్యార్థుల ప్రతిభే ఇందుకు నిదర్శనం అన్నారు. చదవు ఒక్కటే ముఖ్యం కాదనీ, క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకొని జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలన్నారు. గురుకులాల్లో చదువుతూ.. పతకాలను సాధించిన విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. పాఠశాల తరఫున ఉపాధ్యాయులు జేసీకి జ్ఞాపిక అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రమణారెడ్డి, ఎంజేపీ ఆర్సీవో తిరుపతిరెడ్డి, అన్ని పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ప్రత్యేక అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

67
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles