డీఆర్‌వోతో ఎన్నికల సిబ్బంది వాగ్వివాదం

Sat,May 11, 2019 01:47 AM

- కలెక్టర్ ఆదేశాలతో సెల్‌ఫోన్లు అప్పగింత
తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ: ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది సెల్‌ఫోన్ వాడుతున్నట్లు గమనించిన డీఆర్‌వో భిక్షానాయక్ వాటిని తీసుకోవడంతో డీఆర్‌ఓ, ఎన్నికల సిబ్బంది మధ్య వాగ్వివాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, పోలంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించేందుకు శుక్రవారం డీఆర్‌ఓ భిక్షానాయక్ వెళ్లారు. అక్కడ సిబ్బంది సెల్‌ఫోన్లు వాడుతుండడం గమనించిన డీఆర్‌వో వాటిని లాక్కోవడంతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వచ్చారు. కాగా సాయంత్రం ఎన్నికలు ముగిసిన అనంతరం ఎన్నికల సిబ్బంది సామగ్రి, బ్యాలెట్ బాక్సులతో మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి వచ్చిన డీఆర్‌వో భిక్షానాయక్‌ను ఎన్నికల సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిలదీశారు. తీసుకున్న సెల్‌ఫోన్లను ఇవ్వాలని కొద్దిసేపు వాగ్వివాదానికి దిగారు. అనంతరం డీఆర్‌వో కలెక్టర్‌కు ఫోన్‌లో విషయం చెప్పడంతో వారికి సెల్‌ఫోన్లు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం డీఆర్‌వో ఎన్నికల సిబ్బందికి ఫోన్లు అప్పగించడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యెడ చంద్రమౌళి, పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముస్కు తిరుపతిరెడ్డిలు మాట్లాడుతూ పోలింగ్ కేంద్రంలో సిబ్బంది సెల్‌ఫోన్ మాట్లాడలేదనీ, జేబులో ఉంటే డీఆర్‌వో లాక్కోవడం సరికాదని అన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles