క్రీడలను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి

Sat,May 11, 2019 01:47 AM

కరీంనగర్ స్పోర్ట్స్: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ క్రీడలను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ భద్రయ్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో కరీంనగర్ నగరపాలక సంస్థ, జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత వేసవి క్రీడా శిబిరాలను శుక్రవారం ఆయన సందర్శించారు. అనంతరం క్రీడల ప్రాముఖ్యతపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. గత మూడేళ్లుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను అట్టహాసంగా నిర్వహిస్తున్నామనీ, స్మార్ట్ కరీంనగర్, హెల్తీ కరీంనగర్ ధ్యేయంగా నగర ప్రజలు, చిన్నారులు వ్యాయామంపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. జిల్లా ఇన్‌చార్జి యువజన, క్రీడాశాఖాధికారి నాగిరెడ్డి సిద్దారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో క్రీడలకు ప్రాముఖ్యత పెరిగిందనీ, విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో సత్తాచాటి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో 2 శాతం క్రీడా కోటా కింద రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. జిల్లా పెటా సంఘం అధ్యక్షుడు కడారి రవి మాట్లాడుతూ జాతీయస్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో క్రీడా కోటాకు వెసులుబాటు ఉందన్నారు. శిక్షణ శిబిరాల్లో చిన్నారులు మెళకువలు నేర్చుకొని ఉన్నత శ్రేణి క్రీడాకారులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, ఆర్వో రాములు, కోచ్‌లు వసంతకుమార్, సురభి వేణుగోపాల్, మోసం అంజయ్య, వలీపాషా, వీరస్వామి, చందు, మహేందర్, బ్రహ్మం, శేఖర్, రామకృష్ణ, రాజేంద్రప్రసాద్, కనుకయ్య, గంగరాజు, హరీశ్, అరుణ్, ఎల్లయ్య, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

77
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles