ఆకాంక్షకు చేయూత

Fri,May 10, 2019 02:41 AM

-అమ్మాయిల చదువుకు అండగా స్కాలర్‌షిప్‌లు
-పేద, మధ్య తరగతి వారికి భరోసా
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం
- ఊతమిస్తున్న కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు
ధర్మపురి, నమస్తే తెలంగాణ : చదువుకోవాలన్న తపన ఉన్నా, పేదరికం, ఆర్థిక ఇబ్బందులతో ఎందరో అమ్మాయిలు చదువుకు దూరం కావాల్సి వస్తున్నది. చదవాలన్న ఆకాంక్ష ఉండీ, విధిలేక వెనకడుగు వేస్తున్న విద్యార్థినులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, పలు కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు చేయూతనిస్తున్నాయి. ఎన్నో రకాల స్కాలర్‌షిప్ పథకాలను అందిస్తూ అండగా ఉంటున్నాయి. పదోతరగతి నుంచి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చదువుల దా లోకల్ నుంచి ఇంటర్నేషనల్ సంస్థల వరకు వివిధ రకాల స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు మీకోసం..

*ఫెయిర్ అండ్ లవ్‌లీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్..
దేశవ్యాప్తంగా డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు ఈ సంస్థ 2003 నుంచీ స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నది. విద్యార్థినులను చదువులో ప్రోత్సహించే ఉద్దేశంతో వీటిని ప్రవేశపెట్టింది. ఏటా 55 మందిని ఈ స్కాలర్‌షిప్ కింద ఎంపిక చేస్తున్నది. ఎంపికైన విద్యార్థుల వివరాలను ప్రతి నవంబర్‌లో ప్రకటిస్తున్నది. రూ.25వేల నుంచి రూ.50వేల దాకా స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నది. కుటుంబ ఆదాయం రూ.6లక్షలకు తక్కువ ఉన్నవరే ఈ పథకానికి అర్హులు.
వెబ్‌సైట్ : www.fairandlovely foundation.in/

*బ్యాట్ అండ్ బాల్ గేమ్ విమెన్ స్పోర్ట్స్ స్కాలర్‌షిప్..
ఏటా మేలో ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. స్పోర్ట్స్, సైన్స్, ఫిజియోథెరఫీ, మేనేజ్‌మెంట్, ఫిజికల్ అండ్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, సైకాలజీ, న్యూట్రిషియన్, రిహాబిలిటేషన్, ఇతర స్పోర్ట్స్ రిలేటెడ్ కోర్సులు చదవే విద్యార్థినులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 1000 అమెరికన్ డాలర్లను స్కాలర్‌షిప్ కింద అందజేస్తారు..
ఈ మెయిల్ : scholarship@batanballgame.com

*అడోబ్ రీసెర్చ్ విమెన్ ఇన్‌టెక్నాలజీ స్కాలర్‌షిప్..
టెక్నాలజీ రీసెర్చ్‌లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు అడోబ్ సంస్థ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏటా సెప్టెంబర్-అక్టోబర్ నెలలో ప్రవేశాల వివరాలను వెల్లడిస్తారు. ఈ పథకం కింద విద్యార్థినులకు రూ.10వేల అమెరికన్ డాలర్లను స్కాలర్‌షిప్ కింద అందజేస్తారు.
వెబ్‌సైట్ : https// research.adobe.com/scholarship/

*లోరియల్ ఇండియా ఫర్ యంగ్ విమెన్ ఇన్‌సైన్స్ స్కాలర్‌షిప్..
అండర్ గ్రాడ్యుయేట్ చదివే విద్యార్థినుల కోసం ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తారు. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో చదివిన వారు అర్హులు. ఏటా జూన్, జూలై మాసాల్లో ప్రకటన వెలువడుతుంది. యునెస్కో భాగస్వామ్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2003 నుంచి ఇప్పటి వరకు 300 మంది వెనుకబడిన తరగతుల విద్యార్థినులకు ఈ స్కాలర్‌షిప్ అందించారు.
వెబ్‌సైట్ : www.foryoungwomeninscience.com..

*గుగూల్ అనిత బోర్గ్ మెమోరియల్ స్కాలర్‌షిప్..
అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరల్ ప్రోగ్రామ్స్ చదువుతున్న విద్యార్థినులు ఈ పథకానికి అర్హులు. ఏటా మేలో అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్ అకడమిక్‌లో స్ట్రాంగ్‌గా ఉన్న వారిని ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని గుగూల్ ప్రవేశపెట్టింది.
వెబ్‌సైట్ : https//www.womentech makers.com/scholars

*స్వామి వివేకానంద సింగిల్ గర్ల్‌చైల్డ్ స్కాలర్‌షిప్..
రీసెర్చ్ ఇన్‌సోషల్ సైన్సెస్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఈ పథకాన్ని అందిస్తున్నది. సింగిల్ గర్ల్ (ఏకైక కూతురు) ఉన్న తల్లిదండ్రులు మాత్రమే దీనికి అర్హులు. సోషల్ సైన్స్‌లో పీహెచ్‌డీ చదువుతున్న వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థినులకు రూ.28వేల స్కాలర్‌షిప్‌తో పాటు ఇతర బెనిఫిట్స్ అందిస్తారు.
వెబ్‌సైట్‌ః https//www.ugc.ac.in/svsge/

*పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇందిరాగాంధీ స్కాలర్‌షిప్ ఫర్ సింగిల్ గర్ల్..
మాస్టర్ డిగ్రీ చదువుతున్న సింగిల్ గర్ల్స్ మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వీలుంది. రెగ్యులర్, పార్ట్‌టైమ్ కింద కోర్సులు చేస్తున్న వారు దీనికి అర్హులు. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న విద్యాసంస్థల్లో చదువుతున్న ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి రెండేళ్లకు రూ.16,200 స్కాలర్‌షిప్ అందిస్తారు.
వెబ్‌సైట్‌ః https//www.ugc.ac.in/sgc/

*సీబీఎస్‌ఈ మెరిట్ స్కాలర్‌షిప్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్..
పదో తరగతిలో మెరుగైన ప్రతిభ చూపిన విద్యార్థునుల నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ (సీబీఎస్‌ఈ) దరఖాస్తులు కోరుతున్నది. తల్లిదండ్రులకు సింగిల్ గర్ల్‌గా ఉన్నవారే అర్హులు. బాలికా విద్యను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. టెన్త్‌లో 60శాతం లేదా 6.2జీపీఏ పొందిన విద్యార్థినులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఏటా అక్టోబర్‌లో ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎంపికైన విద్యార్థినులకు ప్రతినెలా రూ.500 అందజేస్తారు.
వెబ్‌సైట్‌ః http//cbse.nic.in/

*టాటా హౌసింగ్ స్కాలర్‌షిప్స్ ఫర్ మెరిటోరియస్ గర్ల్ స్టూడెంట్స్..
బీఈ, బీటెక్ ఇంజినీరింగ్, బీఆర్క్ డిగ్రీ, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థునులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. చదువులో ప్రతిభ చూపిన విద్యార్థినులను ప్రోత్సాహం, గుర్తింపు, ఆర్థిక తోడ్పాటునందించేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. అర్హత పరీక్షలో 50శాతం మార్కులు పొంది ఉండాలి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేవారి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.3లక్షలకు మించరాదు.
వెబ్‌సైట్ : https//www.tatahousing.in/csr/about srijan.php

52
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles