పీడీయాక్టుతో నేరాల సంఖ్య తగ్గుముఖం

Fri,May 10, 2019 02:41 AM

-రెండేళ్లలో 73 మందిపై అమలు
-సీపీ కమలాసన్‌రెడ్డి వెల్లడి
కరీంనగర్ క్రైం : కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పకడ్బందీగా నిర్బంధ ఉత్తర్వులు అమలు చేయడం ద్వారా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. గడిచిన రెండేళ్లలో 73 మందిపై పీడీయాక్టు ప్రయోగించామని పేర్కొన్నారు. ఇందులో ఆయుధ నేరాలకు సంబంధించి ఒకరు, దృష్టి మరల్చి నేరాలకు పాల్పడే ఐదుగురు, మత్తు పదార్థాల రవాణాకు సంబంధించి ఇద్దరు, భూ కబ్జాదారులు నలుగురు, కరుడు గట్టిన దొంగలు 39 మంది, మహారాష్ట్ర గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు, రౌడీ షీటర్లు ఏడుగురు, లైంగిక నేరాలకు పాల్పడిన ఒకరు, ఆర్థికపరమైన నేరాల్లో ఎనిమిది మందిపై నిర్బంధ ఉత్తర్వులు అమలు చేశామని వెల్లడించారు. చట్టాలు కఠినమే అయినప్పటికీ ప్రయోగించే తీరును బట్టే ఫలితాలు వస్తాయనీ, అందుకే పీడీయాక్టును అమలు చేస్తున్నామని తెలిపారు. దీని వల్ల వారు ఏడాది పాటు జైళ్లోనే ఉండాల్సి రావడంతో తిరిగి నేరాలు చేసే అవకాశం లేకుండా పోయిందన్నారు. గతంలో పట్టుబడిన నిందితులు బెయిల్‌పై బయటికి వచ్చి తిరిగి నేర ప్రవృత్తినే కొనసాగించేవారని, పీడీ యాక్టుతో వారికి అడ్డుకట్ట పడిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పీడీయాక్టులో జైలుకు వెళ్లిన వారిలో 18 మందికి శిక్షలు కూడా పడేలా చేశామని తెలిపారు.

69
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles