పెండింగ్ పనులను పూర్తి చేయాలి

Fri,May 10, 2019 02:40 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: నగరంలోని ప్రధాన రహదారుల్లో పెండింగ్‌లో ఉన్న డ్రైన్, స్లాబ్ కల్వర్టు పనులను వెం టనే పూర్తి చేయాలని నగర ఇన్‌చార్జి కమిషనర్ భద్రయ్య ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో ఆర్‌అండ్‌బీ, విద్యుత్, బల్దియా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్‌అండ్‌బీ రోడ్లలో అసంపూర్తిగా ఉన్న స్లాబ్ కాల్వర్టులను తక్షణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కమాన్‌రోడ్, వేములవాడరోడ్, రాంనగర్ షిప్ మార్కెట్, టీవీ స్టేషన్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, హోండా షోరూం, ఇందిరాగార్డెన్ సమీపంలోని స్లాబ్ కల్వర్టుల పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. కమాన్‌రోడ్‌లో డ్రైనేజీ, క్రాస్ కల్వర్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసువాలన్నారు. అసంపూర్తి పనులన్నింటినీ ఈనెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. పుట్‌పా త్ నిర్మించిన ప్రాంతాల్లో వర్షపు నీరు సులువుగా కాలువల్లోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయాలనీ, మురుగు కాలువ ల్లో లెవల్స్ సక్రమంగా ఉండే విధంగా చూడాలని అర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ, బల్దియా అధికారులు సమన్వయంతో ఆయా పనులను పరిశీలించి నివేదించాలన్నారు. రోడ్ల మధ్యలో డ్రైనేజీల్లో ఉన్న విద్యుత్ స్తంభాలను వెంటనే తరలించాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, అడిషన ల్ కమిషనర్ రాజేంద్రకుమార్, ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌శాఖ, అధికారులు పాల్గొన్నారు.

79
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles