సర్కారు వైద్యశాలకు స్మార్ట్ నిధులు

Fri,May 10, 2019 02:40 AM

కరీంనగర్ హెల్త్: కరీంనగర్‌తో పాటు ఇతర జిల్లాల నుంచి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు వచ్చే రోగులకు త్వరలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందనున్నట్లు నగర మేయర్ సర్ధార్ రవీందర్‌సింగ్ తెలిపారు. స్మార్ట్ సిటీలో భాగంగా ప్రభుత్వ దవాఖానాకు నిధులు కేటాయించామని చెప్పారు. ద వాఖాన ఆధునీకరణ పనులకు డీపీఆర్ తయా రు చేస్తున్నట్లు ప్రకటించారు. కరీంనగర్ ప్రభుత్వ వై ద్యశాలతో సూపరింటెండెంట్ అజయ్‌కుమార్‌తో పాటు ఆర్వీ కన్సల్‌టెన్షీ బృందం ప్రతినిధులు, హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంజనీరింగ్ అధికారులు, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించా రు. ఆధునిక హంగులతో భవన నిరాణానికి అనువుగా డీపీఆర్ తయారీ కోసం పరిశీలన చేశారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో రూ 35 కోట్లతో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి నిధుల కోటా నుంచి రూ 50 కోట్ల హామీని కలుపుకొని సుమారు రూ 85 కోట్లు నిధులు కేటాయించామని చెప్పారు. రోగులకు మె రుగైన వైద్యంతో పాటు ఆహ్లాద వాతావరణం, అన్ని విభాగాలకు చెందిన వైద్యం అందించేందు కు కృషిచేస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి రూపురేఖలు మార్చేందుకు డీపీఆర్ తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మేయర్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్వీ ప్రతినిధి రాజశేఖర్ కల్నల్, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్‌కుమార్, ఇంజనీర్ల బృందం పాల్గొన్నారు.

70
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles