సాంకేతిక పరిజ్ఞానంతోనే సాధికారత

Thu,May 9, 2019 12:53 AM

సుభాష్‌నగర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఈ-ఆఫీస్ వినియోగంలోకి తేవడం మంచి పరిణామమనీ, ఉద్యోగుల్లో అంకితభావం, బాధ్యత, పారదర్శకత, రికార్డుల భద్రతలాంటి అనేక అంశాల్లో ఈ మార్పు నూతన అధ్యాయానికి శ్రీకారం పలుకుతుందని జేసీ శ్యాంప్రసాద్‌లాల్ పేర్కొన్నారు. స్థానిక ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బుధవారం నిర్వహించిన ఈ-ఆఫీస్‌పై ఒక రోజు ప్రాంతీయ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. అధునాతన యుగంలో అన్ని రంగాల్లో కంప్యూటరీకణ అనివార్యమైందని పేర్కొన్నారు. కళాశాల విద్యాశాఖలో ప్రిన్సిపాళ్లు, వైస్-ప్రిన్సిపాళ్లు, బోధనేతర సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వడం మంచి అవకాశమన్నారు. సభాధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ, ఈ-ఆఫీస్ ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులకు మధ్య ఇంటర్నెట్ ద్వారా పారదర్శక అనుసంధానం జరుగుతుందనీ, దీనికి సుమారు వంద మందికి పైగా ఎస్సారార్ కళాశాలలో శిక్షణ ఇవ్వడం గర్వకారణమన్నారు. కళాశాలల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వుల మేరకు అన్ని ప్రభుత్వ కళాశాలలను ఈ-ఆఫీస్‌కు అనుసంధానం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్‌కేసీ సమన్వయకర్త లక్ష్మీనర్సయ్య శిక్షణ శిబిర నివేదికను సమర్పించారు. కళాశాల విద్యాశాఖ సాంకేతిక నిపుణులు గజేంద్రబాబు, చక్రధర్ ప్రయోగాత్మకంగా శిక్షణ నిచ్చారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ జిల్లాలకు చెందిన ప్రిన్సిపాళ్లు, వైస్-ప్రిన్సిపాళ్లు, పరిపాలనాధికారులు, పర్యవేక్షకులు, సహాయకులు, ఎస్సారార్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

88
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles