సమన్వయంతో ముందుకెళ్లినపుడే అభివృద్ధి

Thu,May 9, 2019 12:52 AM

సైదాపూర్: అధికారులు, ప్రజాప్రతినిధు లు సమన్వయంతో ముందుకెళ్లినపుడే మండలాభివృద్ధి సాధ్యమని ఎంపీపీ ముత్యాల ప్రియారెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం లో మండల సర్వసభ్య సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఐదేళ్లుగా తన కు సహకరించిన అధికారులు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జడ్పీటీసీ బిల్ల వెంకటరెడ్డి మాట్లాడుతూ సర్కారు అమలు చేస్తున్న ప థకాల ఫలాలను ప్రజలకు అందేలా చూడాలన్నా రు. గ్రామా ల అభివృద్ధ్దికి అందరూ సహకరించాలన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సహకారంతో మండలాభివృద్ధ్దికి తనవంతు కృషి చేస్తాననన్నారు. రైతు బీమా బాండ్లు, చెక్కులను అందించాలని సభ్యు లు కోరగా మండల వ్యవసాయాధికారి వైదేహి సమస్యను వెంటనే పరిష్కరిస్తామన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో లూజ్‌లైన్లతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదనీ, తరుచూ విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయని సభ దృష్టికి తీసుకురాగా సమస్యను పరిష్కరించాలని ఎంపీపీ సూచించారు. సింగిల్‌విండో చైర్మన్లు సారాబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చంద శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మునిగంటి స్వామి, ఎంపీడీఓ పద్మావతి తదితరులు ఉన్నారు.

78
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles