ప్లాస్టిక్ దుకాణాలపై దాడులు

Thu,May 9, 2019 12:52 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ : కరీంనగర్‌లో నిబంధనలకు విరుద్దంగా ప్లాస్టిక్ విక్రయిస్తున్న దుకాణాలపై నగరపాలక సంస్థ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. నగరంలోని బుధవారం బల్దియా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు పదికి పైగా ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు చేపట్టారు. పెద్ద సంఖ్యలో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ఇతర వస్తువులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా 50 కిలోలకు పైగా ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ప్లాస్టిక్ అమ్ముతున్న వ్యాపారులపై రూ.33 వేలకు పైగా జరిమానాలు విధించారు. నగరంలోని రైతుబజార్, టవర్‌సర్కిల్, కశ్మీర్‌గడ్డ, సివిల్ ఆస్పత్రి ఏరియాలో 9 హోల్‌సేల్, 4 రిటైల్ షాపులపై దాడులు చేశారు. ఈ సందర్భంగా నగర ఇన్‌చార్జి కమిషనర్ భద్రయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ విక్రయించే వారిపై దాడులు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తామని, మరోసారి పట్టుబడితే షాపు ట్రేడ్‌లైసెన్సు రద్దు చేస్తామన్నారు. ప్లాస్టిక్ నిషేదానికి సంబంధించి బల్దియా నుంచి మూడు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కొక్క బృందంలో 15 మంది సభ్యులు ఉంటారనీ, ప్రతి రోజు నగరంలో దాడులు చేస్తామని హెచ్చరించారు. ప్లాస్టిక్ అమ్మే వ్యాపారులపై సీరియస్ చర్యలు తీసుకుంటామన్నారు. పారిశుధ్య సిబ్బంది మహేందర్, శ్రీధర్, నర్వోత్తమ్‌రెడ్డి, బాలస్వామి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

80
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles