నేత్రపర్వంగా సీతారాముల కల్యాణం

Wed,May 8, 2019 02:05 AM

కరీంనగర్ కల్చరల్ : ముత్యాల తలంబ్రాలు, వేద మంత్రోచ్ఛరణల మధ్య సీతారాముల కల్యాణ మహోత్సవం మంగళవారం నేత్రపర్వంగా జరిగింది. అక్షయ తృతీయను పురస్కరించుకొని జెట్ వికాస తరంగిణి ఆధ్వర్యంలో కొండ సత్యలక్ష్మి గార్డెన్‌లో సీతారాముల కల్యాణ వేడుకలను నిర్వహించారు. వేదికపై త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో కల్యాణ మహోత్సవాన్ని వేద పండితులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. మార్వాడి మహిళలు, కేబీ శర్మ బృందం ఆలపించిన సంకీర్తనలు అలరించాయి. అంతకుముందు చిన్న జీయర్‌స్వామికి వేద భవనం పండితులు, చల్మెడ లక్ష్మీనర్సింహారావు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కే గౌతంరావు, ఎస్. ప్రభాకర్‌రావు, యాద కిషన్, వీర్ల ప్రభాకర్‌రావు, ఎస్. వెంకటేశం, ప్రతాపరెడ్డి, వేద భవనం ప్రిన్సిపాల్ వరప్రసాదాచార్యులు, తదితరులున్నారు.

85
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles